Bigg Boss 9 Telugu Bharani: బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) లో ఇక మీదట బంధాలకు ఫుల్ స్టాప్ పడినట్టేనా..?, భరణి ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో రియల్ గేమ్ మొదలైనట్టేనా? అంటే అవుననే చెప్పొచ్చు. నిన్నటి ఎపిసోడ్ తో ఇమ్మానుయేల్ ఇన్ని రోజులు తాను తొడుక్కున్న ఫేక్ మాస్క్ ని తొలగించి అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ షాక్ ఇచ్చాడు. ఇమ్మానుయేల్ ఇంత కన్నింగ్ కంటెస్టెంట్ అని ఇంతకు ముందు ఊహించలేకపోయాము అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి చెప్పాలంటే హౌస్ లో ఇమ్మానుయేల్ తో సమానంగా మొదటి వారం నుండి గేమ్స్ ఆడుతూ వస్తున్నది కేవలం భరణి మాత్రమే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఫిజికల్ టాస్కుల్లో అయితే భరణి దెబ్బకు ఇమ్మానుయేల్ విలవిలలాడినా సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి భరణి కి నిన్న పవర్ అస్త్ర ని ఉపయోగించే సమయంలో ఇమ్మానుయేల్ చెప్పిన కారణాలు దారుణంగా అనిపించాయి.
రాము రాథోడ్ కంటే మొదటి వారం నుండి భరణి టాస్కులు తక్కువ ఆడాడు అట. అందుకే రాము రాథోడ్ ని సేవ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు భరణి. గడిచిన రెండు వారాలు చూస్తే అసలు రాము ఎలాంటి టాస్కులు ఆడలేదు. మొదటి రెండు వారాల్లో కూడా భరణి ని మించిన ఆట అయితే రాము ఆడలేదు. కీలక సమయాల్లో భరణి సలహాలు తీసుకొనే రాము గేమ్స్ ఆడాడు కానీ, సొంతంగా గేమ్ ఆడిన దాఖలాలు లేవు. అలాంటి రాము ని భరణి కంటే గొప్ప ప్లేయర్ అని ఇమ్మానుయేల్ కి ఎలా అనిపించిందో అసలు అర్థం కావడం లేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేసారు. ఇలాంటి ఫేక్ మనిషికి ఇన్ని రోజులు మనం ఓట్లు వేశామా? అని ఎమోషనల్ గా కనెక్ట్ అయినవాళ్లు అనుకోవచ్చు కానీ, ఇమ్మానుయేల్ తనకు పోటీగా ఉన్నటువంటి భరణి అడ్డు ని చాలా తెలివిగా విజయవంతంగా తొలగించించుకున్నాడని గేమ్ ని అర్థం చేసుకున్నవాళ్లకు అర్థం అవుతుంది.
కానీ ఇమ్మానుయేల్ తో హౌస్ లో ఇక నుండి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. గేమ్ పరంగా అతను కన్నింగ్ గానే వెళ్తున్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. భరణి ఎలిమినేట్ అయితే తనకు ఎంతో మంచి స్నేహితురాలైన తనూజ కుప్ప కూలిపోతుంది అని తెలుసు, హౌస్ మొత్తం బాధపడుతుంది అనే విషయం కూడా తెలుసు, భరణి కారణంగానే ఇమ్మానుయేల్ కి పవర్ అస్త్ర దొరికింది. అలాంటి పవర్ అస్త్ర ని ఉపయోగించి భరణి నే ఎలిమినేట్ చేయడం ఎవ్వరూ ఊహించని పరిణామం. బాహుబలి లో కట్టప్ప బాహుబలి కి పొడిచిన వెన్నుపోటు కంటే పెద్దది ఇది. సినిమాల్లో మాత్రమే ఇలాంటి మోసాలను, అన్యాయాలను మనం చూస్తుంటాం. అయితే బిగ్ బాస్ గేమ్ ని అర్థం చేసుకున్న ఆడియన్స్ నుండి ఇమ్మానుయేల్ కి ఎలాంటి ప్రమాదం లేదు, కానీ ఎమోషనల్ గా కనెక్ట్ అయినా ఆడియన్స్ నుండి మాత్రం ఇమ్మానుయేల్ కి నిన్నటి ఎపిసోడ్ నుండి ప్రమాదం మొదలైంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో మనోడు ఇంకా ఎన్ని కన్నింగ్ యాంగిల్స్ ని చూపిస్తాడు అనేది.