Bigg boss 9 Telugu Emmanuel: టెలివిజన్ రంగంలోనే బిగ్ బాస్ షో అత్యంత ప్రస్తేజియస్ రియాల్టీ షో గా గుర్తింపును సంపాదించుకుంది. ఇక గత సీజన్ల కంటే కూడా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 చాలా రసవత్తరంగా ఉంటుందని తెలుస్తోంది.ఈరోజు మొదటి ఎపిసోడ్ ను చాలా గ్రాండ్ గా పంచ్ చేశారుం సెలబ్రిటీలతో పాటు కామనర్స్ ను సైతం ఇందులో భాగం చేస్తూ ఒక్కొక్క సెలబ్రెటీ గురించి ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న ఇమన్యుయల్ ను సైతం ఈ షో లోకి ఆహ్వానించారు. ఇక తను కమెడియన్ గా తన కెరీర్ ని ఎలా స్టార్ట్ చేశాడు. తను ఊర్లో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనేది ఒక ఏవి ద్వారా ప్లే చేసి ప్రేక్షకులకు తెలియజేశారు. ఇక ఇమాన్యుయల్ కూడా కొంతవరకు ఎమోషనల్ అవుతూ తన జర్నీ గురించి నాగార్జునకు తెలియజేయడం విశేషం… ఇక మొత్తానికైతే తన కామెడీతో జనాల్ని ఎలాగైతే నవ్విస్తాడో బిగ్ బాస్ హౌస్ లో కూడా ప్రతి ఒక్కరిని ఎంటర్ టైన్ చేస్తూనే ప్రతి ఒక్కరికి టఫ్ ఫైట్ ను ఇస్తానని నాగార్జునతో చెప్పడం విశేషం…
ఇక దాంతో పాటుగా నాగార్జున ఇమాన్యుయల్ తో నువ్వు లేడీ వాయిస్ లో పాట బాగా పాడతావట కదా అని అడగగా ఇమాన్యుయల్ అవినని చెప్పి రఘువరన్ బీటెక్ సినిమాలోని ‘అమ్మ అమ్మ నే పసివాడిని అమ్మ’ అంటూ పాటను లేడీ వాయిస్ పాడి నాగార్జునను మెప్పించాడు.
ఇక మొదటి పరిచయంలో నాగార్జున ను ఇంప్రెస్ చేసిన సెలబ్రిటీ కంటెస్టెంట్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక దాంతో పాటుగా ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి అక్కడ తన తోటి కంటెస్టెంట్స్ తో కలిసి మాట్లాడాడు… ఇక ఇమ్మానుయల్ ఈ షో లో ఉండడం వల్ల షో మొత్తం ఎంటర్ టైన్ గా సాగడమే కాకుండా ఆయనకి ఉన్న అభిమానులు ఈ షో ను చూస్తారనే ఉద్దేశ్యంతోనే అతన్ని షో లో భాగం చేశారు.
మరి సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అంటే మామూలుగా ఉండదు అనే ఉద్దేశ్యం తోనే ఇమాన్యుయల్ ను ఇందులో భాగం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక నాగార్జునను ఆకట్టుకున్న ఇమాన్యుయల్ టాస్క్ లను సైతం ఆఅక్ష ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటూ ప్రేక్షకుల యొక్క మన్ననలను పొందుతూ ఈ సీజన్ ఫైనల్ వరకు తన జర్నీని కొనసాగిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…