Bigg Boss 9 Telugu Day 60: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షోలో ఊహించని సంఘటనలు మాత్రమే జరుగుతున్నాయి. గత సీజన్స్ లో టాస్కులు చాలా బలంగా డిజైన్ చేసేవారు. కానీ ఈ సీజన్ లో మాత్రం టాస్కులు తక్కువ, సపోర్టింగ్ టాస్కులు ఎక్కువ. ఈ సపోర్టింగ్ టాస్కుల కారణంగా బిగ్ బాస్ సీజన్ కాస్త డైలీ సీజన్ గా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సీజన్ కి ‘ఒక నాన్న..ఇద్దరు కూతుర్లు’ అనే టైటిల్ ని పెట్టేయొచ్చు. సీజన్ మొత్తం ఈ ముగ్గురు చుట్టూనే తిరుగుతోంది. టీవీ సీరియల్స్ లో బాగా చూసేవాళ్లకు ఈ ముగ్గురు పండించే డ్రామా బాగా నచ్చుతుందో ఏమో తెలియదు కానీ, టీఆర్ఫీ రేటింగ్స్ బాగా వస్తున్నాయి. అందుకే బిగ్ బాస్ 9వ వారం లో కూడా సపోర్టింగ్ టాస్కులు నిర్వహిస్తూ ఉన్నాడు. ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ మొదలైంది.
ఆదివారం ఎపిసోడ్ కూడా ఈరోజు షూట్ చేస్తారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఓటింగ్ ప్రకారం చూస్తే బాటమ్ టాప్ 2 లో రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ ఉన్నారు. వీళ్లిద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే తనూజ వద్ద సేవింగ్ పవర్ ఉంది. దానిని ఎలా అయినా బిగ్ బాస్ టీం ఈ వారం ఉపయోగించాలని ఫిక్స్ అయిపోయారట. అదే కనుక జరిగితే శనివారం రోజున బాటమ్ టాప్ 3 లో ఇద్దరినీ నిల్చోబెట్టి సేవింగ్ పవర్ ని ఉపయోగించవచ్చు. చివరి నాలుగు స్థానాల్లో సంజన, భరణి, రాము రాథోడ్, సాయి కొనసాగుతున్నారు. శనివారం ఎపిసోడ్ లో రాము, సాయి శ్రీనివాస్ ని ఎలిమినేషన్ రౌండ్ లో పెట్టి ఎవరికో ఒకరికి సేవింగ్ పవర్ ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి.
రాము రాథోడ్ ఇంటికి వెళ్లాలని, తన తల్లిదండ్రులను చూడాలని ఈ వారం మొత్తం కోరుకుంటూనే ఉన్నాడు. తనూజ రాము కోసం సేవింగ్ పవర్ ఉపయోగించగలదు, కానీ రాము వద్దంటే మాత్రం సాయి శ్రీనివాస్ కి ఉపయోగించే అవకాశం ఉంటుంది. అప్పుడు సాయి శ్రీనివాస్ సేవ్ అవుతాడు, రాము ఎలిమినేట్ అవుతాడు. ఇక ఆదివారం ఎపిసోడ్ లో కచ్చితంగా భరణి మరియు సంజన మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరుగుతుంది. వీళ్లిద్దరిలో ఎవరికీ తక్కువ ఓట్లు వచ్చి ఉంటాయో, వాళ్ళు ఎలిమినేట్ అయ్యే అవుతారు. సంజన మరియు భరణి కి ఓటింగ్ లో పెద్ద గ్యాప్ లేదు. ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయినా పర్వాలేదు. పోనీ ఈ డ్రామా అంత లేకుండా, కేవలం సింగిల్ ఎలిమినేషన్ అంటే మాత్రం, నూటికి 99 శాతం సాయి ఎలిమినేట్ అవుతాడని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం, చూడాలి మరి ఏమి జరగబోతోంది అనేది.