Bigg Boss 9 Telugu: ఈ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) సీజన్ టైటిల్ విన్నర్ ఎవరో ఫిక్స్ అయ్యి చాలా రోజులే అయ్యింది. మొదటి వారం నుండి నేటి వరకు తనూజ తన తోటి కంటెస్టెంట్స్ పై కనీవినీ ఎరుగని రేంజ్ లీడింగ్ తో కొనసాగుతోంది. అయితే కళ్యాణ్ ఆమెని డామినేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆమెతో కచ్చితంగా గొడవలు పెట్టుకుంటాడు, వీళ్లిద్దరి మధ్య నువ్వా నేనా అనే రేంజ్ గొడవలు జరగబోతున్నాయి అని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే కళ్యాణ్ తనూజ తో గొడవలు పెట్టుకోవాలని అనుకోవడం లేదు. ఆమెకు సహాయం చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. దీంతో ఇతని స్థానం టాప్ 2 కి ఫిక్స్ అయ్యింది. తనూజ తో పాటు రీతూ చౌదరి, ఇమ్మానుయేల్ మరియు డిమోన్ పవన్ లకు విన్నర్ అయ్యేంత సత్తా ఉంది. కానీ డిమోన్ పవన్ నుండి మంచి కంటెంట్ వస్తున్నా, అవి టెలికాస్ట్ చేయకుండా తోక్కేస్తున్నారు.
ఇక మరోపక్క రీతూ చౌదరి కి బలమైన ఎపిసోడ్స్ పడడం లేదు. ఇక ఇమ్మానుయేల్ చూస్తే 9 వారాల నుండి నామినేషన్స్ లో లేదు. వీళ్ళు కాకుండా భరణి కి కూడా టైటిల్ కొట్టేంత సత్తా ఉంది. కానీ ఆయన బంధాల ఊబిలో చిక్కుకున్నాడు. అందులో నుండి బయటకు రాలేకపోతున్నాడు. ఇలా ఎటు చూసినా తనూజ కి దగ్గర్లో ఎవ్వరూ లేరు అని అనుకుంటున్న సమయం లో నిన్న దివ్య చేసిన పనికి తనూజ గ్రాఫ్ బిగ్ బాస్ హిస్టరీ లోనే ఏ కంటెస్టెంట్ కి లేనంతగా పెరిగిపోయింది. తనూజ, భరణి మధ్య బాండింగ్ ని చూసి అసూయతో రగిలిపోతూ దివ్య నిన్న తనూజ ని కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుండి తప్పించింది. ఈ ఒక్క ఎపిసోడ్ తనూజ ని ద్వేషించే వాళ్ళను కూడా అయ్యో పాపం అనిపించేలా చేసింది.
ఎందుకంటే ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా 5 సార్లు కెప్టెన్సీ టాస్క్ లో చివరి వరకు వచ్చి, ఎవరో ఒకరు హ్యాండ్ ఇవ్వడం వల్ల చేజారిపోతోంది. ఇన్ని సార్లు మిస్ అయ్యినప్పుడు ఎవరికైనా బాధ గానే ఉంటుంది. ఆమె ఏడ్చిన ఏడుపులో ఎలాంటి డ్రామా లేదని నిన్న అంతా నమ్మారు. అంతే ఒక్కసారిగా ఆ గ్రాఫ్ ఆకాశాన్ని అంటింది. నిన్నటి ఎపిసోడ్ తో బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ అనేది తనూజ కి ఫిక్స్ అయిపోయింది. ఆమె పేరుని అధికారికంగా లాక్ చేసేసుకోవచ్చు. అయితే రాబోయే రోజుల్లో భరణి పై ఆడియన్స్ లో సానుభూతి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తానూ ఎలాంటి తప్పు చేయకపోయినా, ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోతూనే ఉన్నాడు. ఒక్క రోజు నామినేషన్ లో ఆయన తనలో ఉన్న బాధ ని మొత్తం బయటకు తీస్తే ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా ఆకాశాన్ని అందుకునే అవకాశాలు కూడా లేకపోలేదు, చూడాలి మరి ఏమి జరగబోతోంది అనేది.