Bigg Boss 9 Telugu Divya Vs Tanuja: ఈ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) సీజన్ లో ది బెస్ట్ ఎపిసోడ్ ఏదైనా ఉందా అంటే అది నిన్నటి ఎపిసోడ్ అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ ఎపిసోడ్ లో దివ్య మాస్క్ పూర్తిగా తొలగిపోయింది. తానూ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది కప్ కోసం కాదు, తనూజ మీద కోపం తోనే అని తన నోటితో తానె ఒప్పుకుంది. ఆమె మాటలను బట్టీ చూస్తే తనూజ ని టార్గెట్ గా చేసుకొని ముందు ఆమెతో ఎంతో ఎమోషనల్ కనెక్ట్ అయినా భరణి ని దూరం చేసే పనిలో పడింది. పొరపాటున భరణి తనూజ తో ప్రేమ గా ఉంటే చాలు, చంద్రముఖి లాగా మారిపోతుంది. అందుకు ఉదాహరణే నిన్నటి ఎపిసోడ్. తనూజ కాళ్లకు దెబ్బ తగిలినప్పుడు భరణి ప్రేమతో ఆయింట్మెంట్ పూయడం దగ్గర నుండి మొదలైంది దివ్య కోపం.
ఈ ఘటన జరుగుతున్న సమయం లోనే తనూజ తో భరణి తో చాలా దురుసుగా ప్రవర్తించింది. ఆ తర్వాత భరణి క్లారిటీ కోసం దివ్య వద్దకు వెళ్లి మాట్లాడితే, మీ చెయ్యి బాగాలేదు, నేను మీ గురించి ఆలోచించే చెప్పాను, మీరు ఆమెతో క్లోజ్ గా ఉన్నందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీ స్థానం లో కళ్యాణ్ ఉన్నా నేను అదే చెప్పేదానిని అంటూ పెద్ద డైలాగ్స్ కొట్టింది. కానీ బిగ్ బాస్ కింగ్డమ్ టాస్క్ లో ఈమె భరణి చేత హెడ్ మసాజ్ లు చేయించుకుంది. అప్పుడు ఈమెకు భరణి చేతికి దెబ్బ తగిలింది అనే విషయం గుర్తుకు రాలేదా?, ఎందుకు ఒక మనిషి మీద ఇంత అక్కసు. ఇదే దివ్య పక్క రోజు భరణి తో తనూజ గురించి మాట్లాడుతూ ‘ఆమె తన అవసరానికి తగ్గట్టు మీతో క్లోజ్ గా ఉంటుంది, అదే నాకు నచ్చదు’ అని అంటుంది.
దానికి భరణి సమాధానం చెప్తూ ‘నువ్వు మేమిద్దరం క్లోజ్ గా ఉంటే హర్ట్ అవుతున్నావని తనూజ నే దూరం గా ఉంటూ వస్తోంది’ అని అంటాడు. అప్పుడు దివ్య అబ్బో, అంత సీన్ లేదు లే అని అంటుంది. కానీ నిజంగా తనూజ ఆ కారణం చేతనే భరణి కి దూరం గా ఉంటూ వస్తోంది. ఈ విషయాన్నీ ఒక రోజు రీతూ చౌదరి తో కూడా వాష్ రూమ్ లో ఉన్నప్పుడు అంటుంది తనూజ. ఆమెకు భరణి పై ఎంత ప్రేమ, ఇష్టం, అభిమానం ఉన్నప్పటికీ, ఆయన రీ ఎంట్రీ తర్వాత చాలా వరకు భరణి తో మాట్లాడడం బాగా తగ్గించేసింది. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో వీళ్ళు క్లోజ్ గా ఉండడం చూసి, ఒకసారి కెప్టెన్సీ కంటెండర్ నుండి తొలగించింది, ఇంకోసారి తనూజ కెప్టెన్ అయ్యినప్పుడు భరణి ఆనందంతో పైకి ఎత్తుకోవడం చూసి కుల్లుకుంది, ఇక ఎప్పుడైతే ఆమెకు ఆయింట్మెంట్ రాశాడో, భరణి కూతురు ఎప్పుడైతే తనూజ ని అక్కా అని పిలిచి క్లోజ్ గా ఉండిందో, అప్పటి నుండి ఆవేశం తో రగిలిపోతూ వచ్చింది దివ్య. ఎలాగో ఎలిమినేట్ అవ్వబోతున్నాం కదా, ఈరోజు తనూజ పై ఉన్న ద్వేషం మొత్తం కక్కేయాలని ఫిక్స్ అయ్యి నిన్న అంత రచ్చ చేసింది అనేది వాస్తవం.