Bigg Boss 9 Telugu Dimon Pawan: కేవలం ఒకరు చేసే తప్పు కారణంగా,మరొకరు దారుణంగా నెగిటివ్ అవ్వడం వంటివి గతం లో అనేక బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) సీజన్స్ లో మనం చూసాము. ఈ సీజన్ లో కూడా అదే మిస్టేక్ జరుగుతుంది. రీతూ చౌదరి చేసిన తప్పు కారణంగా డిమోన్ పవన్ బాగా ఎఫెక్ట్ అయ్యాడు. పులిహోర కార్యక్రమం ముందు ఈమె మొదలు పెట్టిందో, లేకపోతే డిమోన్ పవన్ మొదలెట్టాడో తెలియదు కానీ, ఇది పవన్ ఆటకు పెద్ద మైనస్ అయ్యేలాగానే కనిపిస్తుంది. నిన్న సంచాలక్ గా రీతూ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కారణంగానే తానూ కెప్టెన్ అయ్యానని నాగార్జున చూపించిన వీడియోలను చూసి అర్థం చేసుకున్న డిమోన్ పవన్, తన కెప్టెన్సీ ని తిరిగి ఇచ్చేయడం చాలా మంచిగా అనిపించింది. అనంతరం నాగార్జున మళ్లీ మీ మధ్య కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది, ఈసారి కూడా రీతూ చౌదరి నే సంచాలక్ గా ఉంటుంది అని అంటాడు నాగార్జున.
అంతే కాదు రీతూ ఉంటున్న బెడ్ మీదకు వచ్చి, డిమోన్ పవన్ చాక్లెట్ ఇవ్వడం, లవర్స్ లాగా మాట్లాడుకోవడం, ఈ వారం కెప్టెన్ అవ్వమని రీతూ ని అనడం, ఆ తర్వాత అతన్ని కెప్టెన్ చేయడానికి రీతూ చేసిన పనులని చూపించడం తో డిమోన్ పవన్ తానూ ఏమి చేస్తున్నానో అర్థం చేసుకున్నాడు అనుకుంట. అందుకే కెప్టెన్ పదవి ని వదులుకున్నాడు. ఇది రీతూ చౌదరి కి కూడా అవమానకరం అనే చెప్పాలి. తన తప్పు తాను ఒప్పుకున్నప్పటికీ కూడా రేపు నామినేషన్స్ లో రీతూ చౌదరి కి హౌస్ మేట్స్ అందరి కలిసి నామినేట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తనూజ, రీతూ మధ్య పెద్ద గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాస్త రెచ్చగొడితే నోరు జారే అలవాటు ఉన్న రీతూ చౌదరి మరోసారి దారుణంగా నెగిటివ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇకపోతే కెప్టెన్సీ ని వదులుకున్న తర్వాత నలుగురికి మరోసారి టాస్క్ ని ఈరోజు ఎపిసోడ్ ని నిర్వహించారట. ఈ టాస్క్ లో మొదటి రౌండ్ లోనే ఇమ్మానుయేల్ మరియు మనీష్ అవుట్ అవుతారట. చివరి రౌండ్ లో డిమోన్ పవన్, భరణి హోరాహోరీగా తలపడుతారట. చివరికి డిమోన్ గెలిచి మరోసారి కెప్టెన్ అవుతాడట. దీంతో నాగార్జున కూడా అతన్ని ఒక రేంజ్ లో మెచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఈరోజు ఎపిసోడ్ డిమోన్ పవన్ కి పెద్ద పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి నుండి అయినా పులిహోర కంటెంట్ ఇవ్వడం మానేసి గేమ్ మీద ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తే, ఇతను కచ్చితంగా టాప్ 5 వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.