Bigg Boss 9 Telugu Rithu Chowdary: బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) దాదాపుగా క్లైమాక్స్ కి వచ్చినట్టే..ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి నిఖిల్, గౌరవ్ డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఫైర్ స్ట్రోమ్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ మొత్తం ఎలిమినేట్ అయ్యారు. ఈ సీజన్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కాన్సెప్ట్ డిజాస్టర్ అయ్యింది అనే చెప్పాలి. కాస్తో కూస్తో దివ్వెల మాధురి ఒక్కటే కాస్త సౌండ్ చేసింది. కానీ ఆమె పొగరు మాటల కారణంగా ఆడియన్స్ తొందరగా పంపించేశారు. ఇక మూడవ వారం హౌస్ లోకి అడుగుపెట్టిన దివ్య నిఖిత కాస్త ప్రభావం చూపించింది. ఈ వారం ఆమె ఎలిమినేట్ అవ్వాల్సింది, తృటిలో తప్పించుకొని సేవ్ అయ్యింది. ఇది ఆమె అదృష్టం అనే చెప్పాలి. కానీ వచ్చే వారం నామినేషన్స్ లోకి వస్తే ఈమె ఎలిమినేట్ అవ్వడం దాదాపుగా ఫిక్స్ అనుకోవచ్చు.
ఇదంతా పక్కన పెడితే నిఖిల్,గౌరవ్ ఎలిమినేట్ అయ్యాక, హౌస్ లో మిగిలింది కేవలం 9 మంది మాత్రమే. అందరూ బలమైన కంటెస్టెంట్స్. వీళ్ళ మధ్య పెద్దగా ఇప్పుడు పాయింట్స్ లేకపోవడమే పెద్ద సమస్య గా మారిపోయింది. ఎందుకంటే ఎవ్వరూ కూడా గొడవలను ముందుకు తీసుకొని వెళ్లడం లేదు. భారీ గొడవ జరిగితే కేవలం అరగంటలోనే మర్చిపోతున్నారు. ఇక ఒకరిపై ఒకరు నామినేషన్ ఎలా వేసుకోగలరు చెప్పండి. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడింది. ఈ ఎపిసోడ్ డిమోన్ పవన్ కి నెగిటివ్ అవుతుందని అంటున్నారు. కెప్టెన్ గా ఉన్న తనూజ కి బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇచ్చాడట. ఆమె ఎవరికీ నామినేషన్ చేసే అవకాశం ఇస్తే, వాళ్ళే వచ్చి చేయాలట. ఎన్ని నామినేషన్స్ ఒక కంటెస్టెంట్ చెయ్యాలి అనేది కేవలం ఆమె చేతిలోనే ఉంటుందట. ఆమె ఎన్ని చెప్తే అన్ని చెయ్యాలి.
డిమోన్ పవన్ కి ఇద్దరినీ నామినేట్ చేసే అవకాశం ఇచ్చిందట తనూజ. అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ మరియు రీతూ చౌదరి ని నామినేట్ చేసినట్టు తెలుస్తోంది. రీతూ చౌదరి, డిమోన్ పవన్ మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. అలాంటిది రీతూ ని చాలా సిల్లీ పాయింట్స్ తో నామినేట్ చేసాడట డిమోన్ పవన్. దీంతో రీతూ చౌదరి చాలా ఏడ్చింది అని, ఆమెని చూస్తే అయ్యో పాపం అని అనిపిస్తాదని అంటున్నారు. ఇక ఇమ్మానుయేల్ కి కూడా ఇద్దరినీ నామినేట్ చేసే అవకాశం ఇస్తే, ఆయన భరణి, రీతూ చౌదరి ని నామినేట్ చేసినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా సుమన్ శెట్టి, తనూజ తప్ప, అందరూ నామినేషన్స్ లోకి వచ్చారట. వీరిలో వచ్చే వారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.