Bigg Boss 9 Priya And Vijay Deverakonda: బ్లాక్ బస్టర్ టీఆర్ఫీ రేటింగ్స్ తో ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) విజయవంతంగా ఎలా నడుస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. గత సీజన్స్ లో వారాలు గడిచే కొద్దీ ఆట కష్టం గా మారుతూ ఉండేది. కానీ ఈ సీజన్ లో మాత్రం మొదటి రోజు నుండే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ సీజన్ లో ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా కామానర్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో ఒకరు ప్రియా. ఈమెకు అగ్నిపరీక్ష షో సమయం లో మంచి క్రేజ్ ఉండేది. తన అందంతో , క్యూట్ మాటలతో ప్రేక్షకులను కట్టిపారేసిన ప్రియా, హౌస్ లోకి వచ్చినప్పటి నుండి మాత్రం బాగా నెగటీవీ అయిపోయింది. అందరితో బాగానే ఉంటుంది కానీ, కొన్ని కొన్ని సార్లు యాటిట్యూడ్ తో మాట్లాడే మాటలు ఆడియన్స్ కి చాలా చిరాకు కలిగించాయి.
ఇదంతా పక్కన పెడితే చూసేందుకు సినిమా హీరోయిన్ లాగా అనిపించే ప్రియా శెట్టి, నేరుగా సినిమా ఆడిషన్స్ లోనే ప్రయత్నం చేయొచ్చు కదా, అవకాశాలు వస్తాయి కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అగ్నిపరీక్ష షో ప్రారంభం లో అనేవారు. కానీ నిజంగానే అప్పట్లో ఈమె సినిమా ఆడిషన్స్ ఇచ్చిందట. విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం లో చెల్లి పాత్ర చేసే అవకాశం వచ్చిందట. కొన్ని రోజులు ఆమెపై షూటింగ్ కూడా చేశారట. కానీ ఈ విషయం ప్రియా శెట్టి తల్లిదండ్రులకు తెలియదట. తెలుకున్న తర్వాత ప్రియా పై కోపం తెచ్చుకొని ఇంటికి తీసుకెళ్లిపోయారట. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ టీం ఎంత బ్రతిమిలాడినా ప్రియా ని పంపలేదట. కన్న కూతురు లాగా చూసుకుంటాము, దయచేసి పంపండి అని నేరుగా డైరెక్టర్ రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదట.
ఆ తర్వాత ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. కానీ సినిమా రంగం లో రాణించాలి అనే ఆశ ప్రియా లో గట్టిగా ఉండడం తో తల్లిదండ్రులతో పోరాడి అగ్నిపరీక్ష షో లో పాల్గొంది. అదృష్టం కలిసొచ్చి ఈమె జనాలకు కూడా నచ్చడం తో హౌస్ లోపలకు అడుగుపెట్టింది. టాస్కులు చాలా చక్కగా ఆడుతుంది, అందరితో బాగానే మాట్లాడుతుంది, కచ్చితంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ నే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ యాటిట్యూడ్ తో మాట్లాడే మాటలు కారణంగా ఈమె బాగా నెగిటివ్ అయ్యింది. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ప్రియా ఎలిమినేట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.