Bigg Boss 9 Reality Show: త్వరలో ప్రారంభం అవ్వబోయే బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) భారీ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 8 సీజన్స్ ప్రసరమైతే, వాటిల్లో 2,3,4 మరియు 7 వ సీజన్స్ సెన్సేషనల్ హిట్స్ గా నిలిచాయి. 8వ సీజన్ కూడా అదే రేంజ్ లో హిట్ అయ్యేది కానీ, నాగార్జున(Akkineni Nagarjuna) హోస్టింగ్ కారణంగా యావరేజ్ రేంజ్ కి స్థిరపడింది. గత సీజన్ తాలూకు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ఈ సీజన్ ని వేరే లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేశారు మేకర్స్. అందులో భాగంగానే ఈసారి సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం కలిపిస్తున్నారు. ప్రస్తుతం ‘అగ్నిపరీక్ష’ కాంటెస్ట్ జరుగుతుంది. సామాన్యుల నుండి వచ్చిన వేల దరఖాస్తుల్లో కేవలం 200 మందిని ఎంచుకున్నారు. వారిలో ఇంటర్వ్యూ ద్వారా కేవలం 100 మందిని ఎంచుకున్నారు.
ఆ 100 మందిలో గ్రూప్ డిస్కషన్ ద్వారా కేవలం 42 మందిని ఎంపిక చేసి అగ్నిపరీక్ష కాంటెస్ట్ కి పంపించారు. ఈ కాంటెస్ట్ కి బిగ్ బాస్ పాత సీజన్స్ లో టాపర్స్ గా నిల్చిన అభిజిత్, బిందు మాధవి మరియు నవదీప్ లను న్యాయనిర్ణేతలుగా పెట్టారు. శ్రీముఖి ఈ కాంటెస్ట్ కి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే 10 మందిని ఇంటికి పంపేశారట. మిగిలిన వాళ్ళతో ఈ ‘అగ్నిపరీక్ష’ షూటింగ్ జరుగుతుంది. ఇది కాసేపు పక్కన పెడితే ఈ అగ్నిపరీక్ష కాంటెస్ట్ లో ప్రసన్న కుమార్ అనే సామాన్యుడు దుమ్ము లేపుతున్నాడట. బాధకి గురి చేసే విషయం ఏమిటంటే ఇతనికి రెండు కాళ్ళు లేవు. కానీ శరీరం మాత్రం చాలా దృడంగా ఉంటుంది. సాయి ధరమ్ తేజ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ తెరకెక్కిన ‘సుప్రీమ్’ అనే సినిమా మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమాలో ఒక పోరాట సన్నివేశంలో చిన్న పిల్లవాడిని కాపాడడం కోసం ఒక కాళ్ళు లేని పహిల్వాన్ గ్రూప్ ఒకటి ఉంటుంది గుర్తు పట్టారా..?.
Also Read: మహేష్ బాబు – మోహన్ లాల్ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..?
ఆ గ్రూప్ కి లీడర్ గా ఒకడు ఉంటాడు, అతనే ప్రసన్న కుమార్. అతని ఫోటోని మీరు పైన చూడొచ్చు. అంగవైకల్యం ఉన్నప్పటికీ ప్రతిభ విషయం లో ఇతను సాధారణమైన వ్యక్తి కాదు. బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో లోని ఒక ఎపిసోడ్ లో కూడా ఈయన పాల్గొంటాడు. బాలయ్య ని చూస్తే సామాన్యులు ఎవరికైనా భయం వేస్తాది. కానీ ఆరోజు ఇతను బాలయ్య తో అంత ధైర్యంగా, ఎదో తన స్నేహితుడితో మాట్లాడినట్టు గా మాట్లాడాడు. అప్పట్లో అందరూ ఎవరితను ఈ రేంజ్ లో ఉన్నాడు అని మాట్లాడుకున్నారు. అలాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడితే వేరే లెవెల్ లో ఉంటుంది. ఆయన ఈ అగ్నిపరీక్ష కాంటెస్ట్ లో రాణించి హౌస్ లోకి అడుగుపెడితే మాత్రం టైటిల్ రేస్ లోకి అతను రావొచ్చు.