Agnipariksha Reality Show: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘అగ్నిపరీక్ష'(Agnipariksha) షో నిన్న అర్థ రాత్రి నుండి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలు పెట్టింది. సోషల్ మీడియా లో లీకుల ద్వారా మనకి ఈ షో ప్రారంభం కాకముందే ప్రసన్న కుమార్ అనే వ్యక్తి గురించి తెలిసింది. ఒక కాలు లేకపోయినా కూడా ఇతను సాధించిన విజయాలు చూసి మనం ఎంతో మెచ్చుకున్నాము. మొదటి ఎపిసోడ్ లో ఏదైనా హైలైట్ గా నిల్చిన అంశం ఉందంటే అది ప్రసన్న కుమార్(Prasanna Kumar) మాత్రమే. ఆయన మాట్లాడిన మాటలు జీవితం లో ఏది సాధించలేదు అని డీలా పడిన వారికి ఒక కొత్త ఉత్సాహం ని ఇచ్చేలాగా అనిపిస్తుంది. అందుకే జడ్జీలు కూడా అతనికి సెల్యూట్ చేశారు. స్టేజి మీదకు వచ్చి మరీ అభినందించారు. ముఖ్యంగా నవదీప్ ఇతన్ని రిసీవ్ చేసుకున్న విధానం చాలా బాగా అనిపించింది.
Also Read: ‘అగ్ని పరీక్ష’ లో అభిజిత్ కి చుక్కలు చూపించిన దివ్య..పరువు మొత్తం తీసేసిందిగా!
అంతే కాడు టాప్ 15 కి ఎంపిక కాబడిన మొట్టమొదటి కంటెస్టెంట్ ఇతనే. జడ్జీలు అంతలా ఇతన్ని మెచ్చుకోవడానికి కారణం ఏంటి?, అంత గొప్పగా ఇతను ఏమి మాట్లాడాడో ఒకసారి విశ్లేషిద్దాం. ప్రసన్న కుమార్, ఇతను బెంగళూరు లో ఉండే IIM కంపెనీ లో ఒక వీడియో గ్రాఫర్ గా పని చేస్తున్నాడట. అది మాత్రమే కాకుండా ఇతను ఒక ఫోటో గ్రాఫర్, ట్రావెల్లర్, బైక్ రైడర్, మోటార్ సైకిల్ రైడర్, 21 కిలోమీటర్స్ మారథాన్ రన్నర్. ఒక కాలు లేని వ్యక్తి 21 కిలోమీటర్ల రన్నింగ్ రేస్ లో పాల్గొని ఛాంపియన్ గా నిలిచాడంటే, అన్ని చక్కగా ఉండే మనం తల్చుకుంటే ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చో ఊహించుకోండి. ఇతన్ని చూసి, ప్రస్తుతం మనం ఏమి సాధించాము అనే ప్రశ్న ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది కదా?, ఇలా ఒక మనిషికి తన శరీరం లో ఒక అవయవం పోతే మానసికంగా కృంగిపోతాము, జీవితం లో ఏది సాధించలేము అనే ట్రోమాలోకి వెళ్ళిపోతాము, కానీ ఇతను నిలబడి ఈరోజు మన ముందుకు ఇలా వచ్చాడంటే అసలు ఏమని అనుకోవాలి?.
Also Read: ‘అగ్నిపరీక్ష’ తొలి ఎపిసోడ్ లో అదరగొట్టిన నవదీప్,బిందు..అంచనాలను అందుకోలేకపోయిన అభిజిత్!
ఇంతకీ ప్రసన్న కుమార్ కి ఒక కాలు ఎందుకు తీసేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం. డిగ్రీ అయిపోయిన తర్వాత వీక్ ఆఫ్ సమయం లో కాసేపు సరదాగా ఎంజాయ్ చెయ్యాలని న్యూజిల్యాండ్ కి వెళ్లే ముందు షాపింగ్ కోసం వెళ్లిన ప్రసన్న కుమార్, మధ్యలో తన కారు యాక్సిడెంట్ కి గురై కాళ్ళు కోల్పోవాల్సి వచ్చిందట. కానీ అతను తన ఆత్మవిశ్వాసం తో జీవితం లో ఎక్కడా ఆగిపోలేదు. తనకు జీవితం లో ఎదురైనా అతి క్లిష్టమైన ఈ సమస్యని ఎగురుకుంటూ అతని సాధించిన విజయాలను విన్న తర్వాత జడ్జీ గా ఉన్న నవదీప్ చప్పట్లు కొడుతూ పైకి లేచి సెల్యూట్ చేశాడు. సాధారణంగా ఇలాంటి వాళ్లకు చాలా గర్వం ఉంటుంది, కానీ ప్రసన్న కుమార్ ని చూస్తుంటే చాలా సాఫ్ట్ మనిషి లాగా అనిపించాడు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మనస్తత్వం ఇతనిలో ఉన్నట్టుగా అనిపించింది. ఇతని మాటలను ఎవ్వరూ మిస్ అవ్వకండి, జియో హాట్ స్టార్ లో వెంటనే లాగిన్ అయ్యి చూడండి, ఎపిసోడ్ చివర్లో ఇతను వస్తాడు.