Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై అప్పుడే వారం రోజులు గడిచిపోయింది. కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, నిన్న జరిగిన బెబక్క ఎలిమినేషన్ తో 13 మంది కంటెస్టెంట్స్ కి పడిపోయింది. 16 వారాలు హౌస్ నడిచేందుకు ఈ 13 మంది ఏ మాత్రం సరిపోరు, కచ్చితంగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరికొంతమంది కంటెస్టెంట్స్ వస్తారు అనే విషయం ఈపాటికి మీ అందరికీ అర్థం అయిపోయే ఉంటుంది. అయితే వీళ్ళు ఏ వారం లో హౌస్ లోకి అడుగుపెడతారు, అసలు ఎవరెవరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి రాబోతున్నారు అనే అంశాల మీద సోషల్ మీడియా లో ప్రతీరోజు మనం అనేక కథనాలు చూస్తూనే ఉన్నాం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్స్ లో కొత్తవాళ్లు ఉంటారు, అలాగే పాత సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ కూడా ఉంటారు.
ఇదంతా పక్కన పెడితే నిన్న మధ్యాహ్నం నుండి నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఈ నామినేషన్స్ ప్రక్రియ కి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. యష్మీ, నిఖిల్ మరియు నైనిక చీఫ్స్ కాబట్టి వీళ్ళు గత వారంలో నామినేషన్స్ లోకి రాలేదు. వీళ్ళు ఇప్పటికీ చీఫ్స్ గానే కొనసాగుతున్నారు కానీ, ఈ వారం బిగ్ బాస్ చీఫ్స్ ని కూడా నామినేట్ చేసే అవకాశం కల్పించినట్టుగా ఈ ప్రోమోని చూస్తే అర్థం అవుతుంది. అయితే యష్మీ ఎక్కువ సభ్యులు ఉన్న క్లాన్ కి లీడర్ కావడంతో ఆమెను ఎవరూ నామినేషన్ చేయడానికి వీలు లేదని బిగ్ బాస్ కండీషన్ పెట్టి ఉండొచ్చు. అంతే కాదు ఆమెకు ఒకరిని నామినేషన్స్ నుండి తప్పించే పవర్ కూడా ఉంటుంది.
అయితే రెండవ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లేందుకు నామినేట్ అయిన ఇంటి సభ్యుల లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే విష్ణు ప్రియా, నైనిక , నిఖిల్ ఆదిత్య ఓం, పృథ్వీ రాజ్, నాగ మణికంఠ, శేఖర్ బాషా, కిరాక్ సీత నామినేట్ అయ్యారు. వీరిలో ప్రేరణ ని కూడా అనేక మంది కంటెస్టెంట్స్ నామినేట్ చేయడం మనం ప్రోమో లో గమనించాము. కానీ ఈ లిస్ట్ లో ఆమె లేదు, అంటే యష్మీ తన పవర్ ని ఉపయోగించి ఈమెని సేఫ్ చేసింది అనేది అర్థం అవుతుంది. అయితే లైవ్ లో ఎక్కువగా నామినేషన్స్ సమయంలో సోనియా డామినేషన్ ని ఇతర కంటెస్టెంట్స్ తట్టుకోలేకపోతున్నారు అనేది వాస్తవం. ఆమె ప్రతీ ఒక్కరి మీద నోరేసుకొని పడిపోతుంది. బిగ్ బాస్ వాటిని చాలా వరకు కట్ చేసి టెలికాస్ట్ చేస్తున్నాడు. సోనియా ని కాపాడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే ఆమెని కావాలని బిగ్ బాస్ టీం పుష్ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.