https://oktelugu.com/

Journalist Quata Land : ఏపీ మాజీ మంత్రికి తెలంగాణలో జర్నలిస్ట్ కోటాలో స్థలం

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అనేది అందని ద్రాక్షగా ఉండేది. అప్పుడెప్పుడో వైయస్ ప్రభుత్వంలో వివాదాస్పద భూమిని కేటాయించారు. దానిపై వివాదం నలుగుతూ వచ్చింది. మధ్యలో కెసిఆర్ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇప్పుడు రేవంత్ ఆ సాహసం చేసి చూపించారు.

Written By:
  • Dharma
  • , Updated On : September 9, 2024 / 01:48 PM IST

    Journalist Quata Land

    Follow us on

    Journalist Quata Land  : తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. గతంలోజర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రక్రియ వివాదంలో ఉండేది. కోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చినా కెసిఆర్ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. జర్నలిస్టులకు సానుకూలంగా నిర్ణయం తీసుకోలేదు. కానీ రేవంత్ మాత్రం సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టులకు స్వయంగా ఇళ్ల స్థలం కేటాయింపు పత్రాలను అందించారు. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులుగా ఉన్న జర్నలిస్టులకు పత్రాలను అందజేశారు. పూర్తి పారదర్శకంగా అర్హులకుఇంటి సైట్లను కేటాయించినట్లు సీఎం రేవంత్ ప్రకటించారు.కానీ ఈ జాబితాలో వైసీపీ నాయకుడు,మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేరు ఉండడం విశేషం. పూర్వాశ్రమంలో ఆయన జర్నలిస్ట్. ఒక ప్రముఖ పత్రికల్లో పని చేసేవారు. 2005 తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు.కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇంటి స్థలాల మంజూరు జాబితాలో ఏపీ మాజీమంత్రి కి ఛాన్స్ దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    * అనూహ్యంగా కన్నబాబు పేరు
    ఇళ్ల స్థలాలకు అర్హులైన జర్నలిస్టుల జాబితాను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది.ఈ జాబితాలో కన్నబాబు పేరు వండడం సంచలనం గా మారింది. నంబర్ 280 దగ్గర కురసాల కన్నబాబు, చీఫ్ రిపోర్టర్ గా డిజిగ్నేషన్ ఉండడం గమనార్హం. దీంతో ఈ జాబితా పై రకరకాల అనుమానాలు ప్రారంభమయ్యాయి. అసలు ఈ జాబితా ఎప్పుడు తయారు చేశారు? ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? అన్నది చర్చకు దారితీస్తోంది. కురసాల కన్నబాబు పేరు నిజంగానే ఉంటే మాత్రం ఇది వివాదానికి దారి తీసే అవకాశం ఉంది.

    * 20 ఏళ్లుగా వృత్తికి దూరం
    2005 వరకు కురసాల కన్నబాబు జర్నలిస్టుగా ఉండేవారు. అటు తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పూర్తి చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఓడిపోయారు. 2019లో కాకినాడ రూరల్ నుంచి విజయం సాధించి మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు.జర్నలిస్టుగా ఉన్నఈయన రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు.అయితే ఎన్నడో విడిచిపెట్టిన జర్నలిజం వృత్తి నుంచి ఈయనకు ఇంటి స్థలం లభించడం చర్చకు దారి తీస్తోంది.

    *తప్పిదం జరిగిందా?
    దాదాపు 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు కన్నబాబు.జర్నలిజం వృత్తినే విడిచి పెట్టేసారు.అసలు జర్నలిస్టుగా అక్రిడేషన్ ఉంటేనే ఇంటి స్థలం లభించాలి.ఈ లెక్కన ఆయనకు ఎలా స్థలం కేటాయించారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.జాబితాను పరిశీలించకుండానే ప్రకటించారా? పాత జాబితానే అలాగే చదివేశారా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ కన్నబాబుకు స్థలం కేటాయిస్తే మాత్రం వివాదంగా మారే అవకాశం ఉంది.