Bigg Boss 8 Telugu: హాట్ యాంకర్ విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టింది. గతంలో బిగ్ బాస్ షో అంటే పెద్దగా ఆసక్తి లేదన్న విష్ణుప్రియ మనసు మార్చుకుంది. బిగ్ బాస్ షోకి విష్ణుప్రియ వ్యతిరేకంగా మాట్లాడిన వీడియో వైరల్ చేశారు. ఆ కోణంలో ఆమె ట్రోల్ కి గురైంది. గత రెండు మూడు సీజన్స్ నుండి విష్ణుప్రియ పేరు వినిపిస్తోంది. ప్రతిసారి ఆమె ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఈసారి సర్ప్రైజింగ్ ఎంట్రీ ఇచ్చింది. విష్ణుప్రియకు మేకర్స్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తున్నారని సమాచారం.
వారానికి విష్ణుప్రియ రూ. 4 లక్షలు ఛార్జ్ చేస్తుందట. ఈ సీజన్ కి ఆమెదే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని వినికిడి. ప్రస్తుతానికి విష్ణుప్రియ టైటిల్ ఫేవరేట్ గా ఉంది. కారణం పెద్దగా తెలిసిన ముఖం ఒక్కటి లేదు. కాగా విష్ణుప్రియ మొదటి వారానికి గానూ నామినేట్ అయ్యింది. నాగ మణికంఠ, శేఖర్ బాషా, పృథ్విరాజ్, సోనియా ఆకుల, బేబక్క నామినేటైన మిగతా కంటెస్టెంట్స్. ఈ ఆరుగురిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే లేదు. నాగ మణికంఠ, సోనియా ఆకుల, బేబక్కలలో ఒకరు ఇంటిని వీడనున్నారని తెలుస్తుంది. మరోవైపు విష్ణుప్రియ అబ్బాయిలతో సన్నిహితంగా ఉంటుంది. నటుడు పృథ్విరాజ్ కి సేవలు చేస్తున్న విష్ణుప్రియ… నన్ను ప్రేమించొచ్చుగా అని నేరుగా అడిగింది. ఆ మాటకు పృథ్విరాజ్ షాక్ అయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.
తాజాగా మరో వీడియో వైరల్ చేస్తూ విష్ణుప్రియను ట్రోల్ చేస్తున్నారు. హౌస్లో యోగా చేస్తున్న విష్ణుప్రియ సుధీర్ఘ రాగం అందుకుంది. ఆమె స్వరం వింటే మెడిటేషన్ చేసేవాళ్లకు కూడా ఇరిటేషన్ వచ్చేలా ఉంది. ఈ వీడియోకి ఓ నెటిజెన్.. కుడితి కోసం అరుస్తున్న గేదె అరుపులా ఉందని కామెంట్ పెట్టాడు. మరొకరు నీ గోలకు మిగతా కంటెస్టెంట్స్ కి నిద్రకూడా పట్టదు అని ఫన్నీ కామెంట్ పోస్ట్ చేశాడు.
విష్ణుప్రియ కెరీర్ యూట్యూబర్ గా మొదలైంది. గతంలో ఆమె యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కామెడీ వీడియోలు చేసేది. పోవే పోరా షోతో యాంకర్ అవతారం ఎత్తింది. సుడిగాలి సుధీర్-విష్ణుప్రియ ఈ షోకి యాంకర్స్ గా వ్యవహరించారు. ఇంస్టాగ్రామ్ వేదికగా విష్ణుప్రియ గ్లామరస్ వీడియోలు, ఫొటోలతో కాకరేపుతుంది. నటిగా ప్రయత్నాలు చేస్తుంది. గత ఏడాది హాట్ స్టార్ లో విడుదలైన దయ వెబ్ సిరీస్లో విష్ణుప్రియ కీలక రోల్ చేసింది.