https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: నాగార్జున ఉగ్రరూపం..అభయ్ కి ‘రెడ్ కార్డు’ ఇచ్చి బయటకి గెంటేసిన నాగార్జున..వైరల్ గా మారిన వీడియో!

పృథ్వీ రాజ్ కి రెడ్ కార్డు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన గత వారంలో ఇంగ్లీష్ లో ఎన్నో బూతులు మాట్లాడాడు, ఇంకోసారి అలా మాట్లాడితే బిగ్ బాస్ నుండి బయటకి గెంటేస్తాము అని నాగార్జున పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. కానీ పృథ్వీ తన తీరుని ఏమాత్రం మార్చుకోలేదు, అంతే కాకుండా హౌస్ లో అనేక మంది కంటెస్టెంట్స్ ని బొమ్మలు విసిరినట్టు విసిరేసాడు. కొంతమందికి బాగా దెబ్బలు కూడా తగిలాయి.

Written By:
  • Vicky
  • , Updated On : September 21, 2024 / 04:59 PM IST

    Nagarjuna(7)

    Follow us on

    Nagarjuna: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఎంత క్రూరంగా ఆడారో మన అందరికీ తెలిసిందే. కొంతమంది కంటెస్టెంట్స్ మనుషులు అనే విషయాన్నీ కూడా మర్చిపోయి చాలా దారుణంగా ప్రవర్తించారు. ఈ సీజన్ ని చూస్తున్న ప్రేక్షకులకు అసలు ఎక్కడి నుండి తీసుకొచ్చారు వీళ్ళని అని తిట్టుకుంటున్నారు. టాస్కులు గోరంత, గొడవలు కొండంత అన్నట్టుగా ఈ సీజన్ సాగిపోతుంది. ఒకరిని ఒకరు కొట్టుకోవడం, ఇష్టమొచ్చినట్టు బూతులు మాట్లాడుకోవడం, సందర్భం లేకుండా ఆ హగ్గులేంటో, బిగ్ బాస్ ని నోటికి వచ్చినట్టు తిట్టడం ఏంటో, అసలు ఈ షో ఏంటో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గత వారం జరిగిన గొడవల కారణంగా టీఆర్ఫీ రేటింగ్స్ భారీ వచ్చాయట. అలాంటి గొడవలు జరిగి రేటింగ్స్ రప్పించడమే బిగ్ బాస్ టీం స్ట్రాటజీ అనేది అందరికీ అర్థం అయ్యింది. అయితే ఈ వారం హద్దులు మీరిన ఇద్దరు కంటెస్టెంట్స్ కి నాగార్జున రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

    వారిలో ముందుగా పృథ్వీ రాజ్ కి రెడ్ కార్డు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన గత వారంలో ఇంగ్లీష్ లో ఎన్నో బూతులు మాట్లాడాడు, ఇంకోసారి అలా మాట్లాడితే బిగ్ బాస్ నుండి బయటకి గెంటేస్తాము అని నాగార్జున పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. కానీ పృథ్వీ తన తీరుని ఏమాత్రం మార్చుకోలేదు, అంతే కాకుండా హౌస్ లో అనేక మంది కంటెస్టెంట్స్ ని బొమ్మలు విసిరినట్టు విసిరేసాడు. కొంతమందికి బాగా దెబ్బలు కూడా తగిలాయి. ఇది ఇలా ఉండగా కాసేపటి క్రితమే నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేసారు. ఈ ప్రోమో లో అభయ్ ఈ వారం బిగ్ బాస్ ని తిట్టిన మాటలను వినిపించారు, అనంతరం నాగార్జున మాట్లాడుతూ ‘అన్ని లఫంగి మాటలే..అభయ్ ఇది బిగ్ బాస్ హౌస్..ఇక్కడ బిగ్ బాస్ రూల్స్ మాత్రమే నడుస్తాయి’ అని అంటాడు. ఆ తర్వాత అభయ్ మోకాళ్ళ మీద పడి నాగార్జున కి దండం పెడుతాడు.

    కానీ నాగార్జున ఒప్పుకోడు, బిగ్ బాస్ మీద గౌరవం లేకపోతే నేను అసలు క్షమించను, ఇప్పుడు నేను నీకు రెడ్ కార్డు ఇస్తున్నాను, బిగ్ బాస్ డోర్లు ఓపెన్ చేయండి, అభయ్ బయటకి వెళ్ళు అని నాగార్జున అంటాడు. సార్ దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి అని అభయ్ బ్రతిమిలాడగా, నేను నిర్ణయం తీసేసుకున్నాను, బయటకి రా అని అంటాడు. మరి అభయ్ ని నిజంగా బయటకి గెంటేశారా?, లేకపోతే కేవలం ప్రోమో కోసం అలా కట్ చేసారా అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. ఓటింగ్ పరంగా కూడా అభయ్ అందరికంటే తక్కువలో ఉన్నాడు. కానీ రెడ్ కార్డు ఇచ్చి బయటకి గెంటేశారు కాబట్టి , అతనికి రెగ్యులర్ కంటెస్టెంట్స్ కి ఇచ్చే గౌరవం ఇవ్వకపోవచ్చు, చూడాలి మరి ఏమి జరుగుతుందో.