Bigg Boss 8 Telugu: గత సీజన్ లో చేసిన పొరపాటే ఈ సీజన్ లో కూడా కంటెస్టెంట్స్ చేస్తున్నారా..?, పల్లవి ప్రశాంత్ ‘రైతు బిడ్డ’ అనే సెంటిమెంట్ ని వాడుకొని గేమ్ ఆడుతున్నడని అమర్ దీప్ తో పాటుగా, మిగిలిన కంటెస్టెంట్స్ అందరు పల్లవి ప్రశాంత్ మీద ఒక్కసారిగా నామినేషన్స్ వర్షం కురిపించారు. ఆ ఎపిసోడ్ అతన్ని హీరోని చేసింది. ఇప్పుడు నాగ మణికంఠ విషయం లో కూడా అదే జరుగుతుంది. అతనిపై జనాల్లో సానుభూతి రోజురోజుకి పెరిగేలా చేస్తుంది. చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు, పెద్దయ్యాక తల్లి చనిపోయింది, కట్టుకున్న భార్య కూడా వదిలేసింది , ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటున్న సమయంలో నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అని లాంచ్ ఎపిసోడ్ రోజు నాగ మణికంఠ ఈ విషయాన్ని చెప్పినప్పుడు ప్రేక్షకులు బాగా ఎమోషనల్ అయిపోయారు.
ఇక ఆ తర్వాత నాగ మణికంఠ ని మొదటి ఎపిసోడ్ లోనే హౌస్ మేట్స్ అందరు బయటకి పంపాలని చూడడం, అతను బాగా ఎమోషనల్ అయిపోవడం, మళ్ళీ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం వంటివి జరిగింది. ఇక ఈరోజు జరిగిన నామినేషన్స్ లో పాపం అతన్ని కంటెస్టెంట్స్ అందరూ బాగా టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఎంతసేపు ఎమోషనల్ సెంటిమెంట్ తో గేమ్ ఆడాలని అనుకుంటున్నారు అంటూ ప్రతీ ఒక్కరు పదే పదే అతని గతాన్ని గుర్తు చేసి టార్చర్ చేసే ప్రయత్నం చేసారు. ఈరోజు జరిగిన నామినేషన్స్ లో అత్యధిక శాతం ఓట్లు అతనికే పడ్డాయి. ముఖ్యంగా యష్మీ గౌడ, ప్రేరణ మరియు పృథ్వీ రాజ్ ఈ అంశం మీదనే టార్గెట్ చేసి నాగ మణికంఠ ని నామినేట్ చేసారు. దీనికి అతని మళ్ళీ ఎమోషనల్ అయ్యి నేను మాములు మనిషిగా మారి గేమ్ ఆడుదాం అనుకుంటే మీరు పదే పదే ఆ విషయాన్నే గుర్తు చేస్తున్నారు, అందుకే నేను దాని గురించి చెప్పుకోవాల్సి వస్తుంది, కావాలని చెప్పడం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈరోజు కంటెస్టెంట్స్ అందరూ నాగ మణికంఠ విషయంలో తప్పు చేసారు కానీ, విష్ణు ప్రియ విషయంలో మాత్రం తప్పు నాగ మణికంఠదే.
ఎందుకంటే విష్ణు ప్రియ అతనితో నిజాయితీగా స్నేహం చెయ్యాలని అనుకుంది. అతని ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ మొత్తం విని అతనికి ధైర్యం చెప్పింది . కానీ సరదాగా విష్ణు ప్రియ అతనితో మాట్లాడుతున్నప్పుడు నోరు జారిన పదాన్ని పట్టుకొచ్చి ఆమెని నామినేట్ చేసాడు. ఆ తర్వాత నువ్వు ఎలాంటి దానివో తెలుసుకోవడం కోసం ఈ వారం మొత్తం నీతో తిరిగాను అనడం విష్ణు ప్రియ కి చాలా బాధని కలిగించింది. నేను నిన్ను నిజాయితీ గల వాడివి అనుకున్నాను, కానీ నీ మనసులో ఇంత పెట్టుకొని ఈ రెండు రోజులు నా వెనుక తిరిగావని అనుకోలేదు, నువ్వు నీ గేమ్ కోసం సెంటిమెంట్ ని వాడుకుంటున్నావు అంటూ మణికంఠ పై విరుచుకుపడింది.