Bigg Boss Telugu 8: అట్టహాసంగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 8 మొన్న ఆదివారం ప్రసారమైన ఫినాలే ఎపిసోడ్ తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ ఫ్లాప్, సెకండ్ హాఫ్ హిట్టు అన్న విధంగా సాగింది. ఓవరాల్ గా యావేరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. వైల్డ్ కార్డ్స్ ఈ సీజన్ కి ఆయువుపట్టు. ఆ వైల్డ్ కార్డ్స్ అవినాష్ అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తే, గౌతమ్ అద్భుతంగా గేమ్స్ ఆడి టాప్ 2 వరకు వచ్చాడు. విన్నర్ అవ్వాల్సింది కానీ తృటిలో మిస్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే కేవలం ఆరు మంది కంటెస్టెంట్స్ కి తప్ప, మిగిలిన వాళ్లందరికీ రెమ్యూనరేషన్స్ చాలా తక్కువగా ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మొదటి వారం నుండి ఎలిమినేట్ అవుతూ వచ్చిన కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఎంత రెమ్యూనరేషన్స్ తీసుకున్నారో ఈ కథనంలో వివరంగా చూద్దాం.
బెజవాడ బేబక్క:
యూట్యూబ్ లో మంచి పాపులారిటీ ని తెచ్చుకున్న ఈమె, మొదటి వారంలోనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఒక్క వారం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఈమె తీసుకున్న రెమ్యూనరేషన్ 1,75,000 రూపాయిలు.
శేఖర్ బాషా:
హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుండి తన పదునైన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈయన, ఒక విధంగా చెప్పాలంటే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నాడు. తన భార్య కడుపుతో ఉందని, తన బిడ్డ రాబోతున్నాడని, దయచేసి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటే తనని బయటకి పంపేయండి అంటూ ఆయన హౌస్ మేట్స్ అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నాడు. చివరికి అదే జరిగింది. రెండు వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఆయన 4,30,000 రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.
అభయ్ నవీన్:
సినిమాల్లో కమెడియన్ గా రాణిస్తున్న ఈయన మూడవ వారం లో బిగ్ బాస్ పై అనుచిత కామెంట్స్ చేసి, బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకొని బయటకి వచ్చాడు. అలా మూడు వారాలు హౌస్ లో ఉన్నందుకు ఆయన 6 ,30,000 రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.
సోనియా :
ఉన్నది నాలుగు వారాలు అయినా హౌస్ ని షేక్ చేసి వెళ్లిన కంటెస్టెంట్ ఈమె. ఈమెని బయటకి పంపేందుకు బిగ్ బాస్ టీం కి అసలు మనసు రాలేదు. కానీ తప్పని పరిస్థితిలో బయటకు పంపాల్సి వచ్చింది. నాలుగు వారాలు హౌస్ లో ఉన్నందుకు ఈమె 8,50,000 రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది.
ఆదిత్య ఓం & నైనికా :
వీళ్లిద్దరు 5వ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఒకరు, వీకెండ్ లో ఒకరు ఎలిమినేట్ అయ్యారు. ఆదిత్య ఓం ఒకప్పుడు తెలుగు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన మీద చాలా అంచనాలు ఉండేవి కానీ, ఆ అంచనాలను అందుకోవడం విఫలం అయ్యాడు. అందుకే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. 5 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఆయన 12,50,000 రెమ్యూనరేషన్ అందుకున్నాడు. ఇక అదే వారం లో ఎలిమినేట్ అయినా నైనికా 9 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకుంది.
సీత & మణికంఠ :
బేబీ చిత్రం ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న సీత మొదట్లో చాలా బాగా ఆడింది. కచ్చితంగా టాప్ 5 వరకు వస్తుందని అనుకున్నారు కానీ, ఒక్క వారం మొత్తం ఆమె గేమ్స్ ఆడకపోవడం వల్ల ఎలిమినేట్ అయ్యింది. ఆరు వారాలు హౌస్ లో ఉన్నందుకు ఆమె 9 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది. ఇక మణికంఠ సంగతి అందరికీ తెలిసిందే. హౌస్ లో కన్నడ బ్యాచ్ పెట్టే టార్చర్ తట్టుకోలేక తనకి తానే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని బయటకి వెళ్ళిపోయాడు. ఒకవేళ మణికంఠ అలాగే కొనసాగి ఉండుంటే విన్నర్ కూడా అయ్యేవాడు. 7 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఆయన 11 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకున్నాడు.
మెహబూబ్ & నయనీ పావని :
వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టిన వీళ్లిద్దరు 8 వ వారంలో ఒకరు, 9వ వారంలో మరొకరు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. సీజన్ 4 లో మెహబూబ్ చూపించిన ప్రభావం, ఈ సీజన్ లో చూపించలేకపోయాడు. అందుకే ఆయన ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. రెండు వారాలు హౌస్ లో ఉన్నందుకు ఆయన 7 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు. ఇక సీజన్ 7 లో వైల్డ్ కార్డు ఎంట్రీ గా వచ్చి మొదటి వారంలోనే ఎలిమినేట్ అయినా నయనీ పావని, ఈసారి కూడా వైల్డ్ కార్డు గా వచ్చి మూడు వారాలు హౌస్ లో కొనసాగింది. మూడు వారాలు ఉన్నందుకు ఆమె 7 లక్షల రూపాయిలను తీసుకుంది.
గంగవ్వ & హరితేజ :
సీజన్ 1 లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చిన హరితేజ, ఈ సీజన్ వైల్డ్ కార్డుగా వచ్చి నాలుగు వారాల్లోనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. నాలుగు వారాలు హౌస్ లో ఉన్నందుకు ఆమె 11 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంది. ఇక సీజన్ 4 లో వచ్చిన గంగవ్వ, ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆరోగ్య సమస్యల కారణంగా సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యింది. 5 వారాలు ఉన్నందుకు ఈమె 9 లక్షల రెమ్యూనరేషన్ ని అందుకుంది.
యష్మీ:
సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ ని తెచ్చుకున్న ఈమె, ఆడపులి లాగా టాస్కులు ఆడి, కచ్చితంగా టాప్ 5 కి వెళ్తుంది అని అనిపించుకుంది. కానీ ఆ తర్వాత నుండి ఈమె ట్రాక్ మరోవైపు షిఫ్ట్ అవ్వడంతో 12 వారాలకే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. 12 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఈమె 30 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది.
టేస్టీ తేజ & పృథ్వీ రాజ్ :
సీజన్ 7 లో అద్భుతమైన ఎంటెర్టైమెంట్ ని అందించిన టేస్టీ తేజ, ఈ సీజన్ లో వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చి ఎంటర్టైన్మెంట్ తో పాటుగా, టాస్కులు కూడా అద్భుతంగా ఆడాడు. అలా 7 వారాలు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన ఇతనికి 18 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందించారు. ఇక టాప్ 5 లో ఉండేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్నటువంటి పృథ్వీ, ఏకంగా 11 వారాలు నామినేషన్స్ లోకి వచ్చి, 13 వ వారం దురదృష్టం కొద్దీ ఎలిమినేట్ అయ్యాడు. అలా 13 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ 28 లక్షల రూపాయిలు.
రోహిణి & విష్ణు ప్రియా :
కమెడియన్ గా మంచి పాపులారిటీ ని సంపాదించిన రోహిణి, ఈ సీజన్ లో వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చి, అద్భుతంగా గేమ్స్ ఆడి, విన్నర్ కంటే ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకుంది. డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఎలిమినేట్ అయిన ఈమె, 8 వారాలు హౌస్ లో ఉన్నందుకు 22 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది. అదే వారం లో టాప్ 6 స్థానంలో ఎలిమినేట్ అయిన విష్ణు ప్రియ 14 వారాలు హౌస్ లో ఉన్నందుకు గానూ 42 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది. ఈమె పాపులర్ యాంకర్ అవ్వడం వల్ల ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ని ఇచ్చారు.
నబీల్ & అవినాష్ :
ఈ సీజన్ లో అవినాష్ లేకపోతే, ఎంటర్టైన్మెంట్ లేదు. టాప్ 5 స్థానంలో ఎలిమినేట్ అయిన ఈయన టైటిల్ విన్ అయ్యేందుకు కూడా అర్హుడు. ఎంటర్టైన్మెంట్ తో పాటు, టాస్కులు కూడా అద్భుతంగా ఆడి తన సత్తా చూపించాడు. వైల్డ్ కార్డు గా రావడం అవినాష్ కి పెద్ద మైనస్ అయ్యింది. మొదటి నుండి వచ్చి ఉండుంటే ఈయన టైటిల్ విన్నర్ గా నిల్చేవాడని ప్రేక్షకుల అభిప్రాయం. 10 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఈయన 28 లక్షలు తీసుకున్నాడు. ఇక ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేని నబీల్, ఈ షోలోకి అడుగుపెట్టి, కోట్లాది మంది తెలుగు ప్రేక్షలుకు దగ్గరై, మంచి క్రేజ్ ని సంపాదించుకొని టాప్ 3 స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు. 15 వారాలు ఆయన హౌస్ లో ఉన్నందుకు 32 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు.
ప్రేరణ:
టాప్ 4 స్థానంలో ఎలిమినేట్ అయిన ఈమె, ఏకంగా 37 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది. కచ్చితంగా ఈమె టైటిల్ విన్ అవ్వాల్సిన కంటెస్టెంట్. కానీ నోటి దూల కారణంగా తన గ్రాఫ్ ని తానే తగ్గించుకుంది.
విన్నర్ నిఖిల్ & రన్నర్ గౌతమ్ :
వైల్డ్ కార్డు గా హౌస్ లోకి అడుగుపెట్టి, వైల్డ్ ఫైర్ లాగా చెలరేగిపోయి గేమ్స్ ఆడిన గౌతమ్, విన్నర్ అవుతాడు అనుకుంటే, రన్నర్ గా నిలిచాడు. చాలా తక్కువ మార్జిన్ తో ఆయన విన్నింగ్ రేస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. 10 వారాలు హౌస్ లో ఉన్నందుకు గౌతమ్ 21 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు. ఇక విన్నర్ గా నిల్చిన నిఖిల్ ఏకంగా కోటి రూపాయిలు ఈ సీజన్ ద్వారా అందుకున్నాడు. పాపులర్ టీవీ సీరియల్ హీరో అవ్వడంతో ఈయనకి 15 వారాలకు గాను 42 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇచ్చారు. ఇది కాకుండా 55 లక్షల రూపాయిల ప్రైజ్ మనీ + కారు, మొత్తం కలిపి కోటి రూపాయలకు పైగా ఆయన ఈ సీజన్ లో సంపాదించుకున్నాడు.