Homeఎంటర్టైన్మెంట్Pallavi Prashanth: బయటపడుతున్న పల్లవి ప్రశాంత్ నిజ స్వరూపం... బిగ్ బాస్ డబ్బులతో జల్సాలు!

Pallavi Prashanth: బయటపడుతున్న పల్లవి ప్రశాంత్ నిజ స్వరూపం… బిగ్ బాస్ డబ్బులతో జల్సాలు!

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ గా బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss season 7) లో అడుగుపెట్టాడు. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి రైతుల కోసం, వాళ్ళ కష్టాలు తీర్చడం కోసం బిగ్ బాస్ కి వచ్చానంటూ కబుర్లు చెప్పాడు. నేల తల్లి సాక్షిగా రైతులకు అండగా ఉంటానని ప్రమాణాలు చేశాడు. అంతటితో ఆగకుండా తను కనుక బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం రైతులకు పంచుతానని మాట ఇచ్చాడు. పంచిన ప్రతి ఒక్క రూపాయి లెక్కలతో సహా చూపిస్తాను అంటూ శపధాలు చేశాడు.

కట్ చేస్తే ఊహించని విధంగా ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. అతనికి రూ. 35 లక్షలు ప్రైజ్ మనీ వచ్చింది. కానీ హౌస్ లో ఉన్నప్పుడు ఒక లెక్క .. బయటకు వచ్చిన తర్వాత మరో లెక్క అన్నటుగా ప్రశాంత్ తీరు మారిపోయింది. తనకు వచ్చిన డబ్బులు రైతులకు పంచుతాను అని చెప్పిన మాట గాలికి వదిలేశాడు. పైగా ఎవరైనా డబ్బులు ఎప్పుడు పంచుతావని అడిగితే… ఏవేవో రూల్స్ లాగడం మొదలెట్టాడు. నెటిజన్లు ఏకిపారేస్తుడటంతో మొదటి సాయం చేశాడు.

Also Read: Bigg Boss: బిగ్ బాస్ ని గట్టిగా వాడేస్తున్న యూట్యూబ్ రివ్యూవర్స్… వీళ్ళ సంపాదన తెలిస్తే నోరెళ్ళబెడతారు!

లక్ష సహాయం చేసి కోటి రూపాయల బిల్డప్ ఇచ్చాడు. అది చేసి నెలలు గడుస్తున్నా మరో రైతుకు సాయం చేసింది లేదు. ఆ ఊసు కూడా ఎత్తడం లేదు. కానీ బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీని మాత్రం ఓ రేంజ్ లో వాడుకుంటున్నాడు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ చేస్తున్నాడు. ఎక్కువగా తన గురువు శివాజీ(Sivaji) తో కలిసి తెగ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ నుంచి గిఫ్ట్ గా వచ్చిన కొత్త కారులో షికార్లు చేస్తున్నారు.

Also Read: Sridevi Drama Company: సుధీర్ బాబు ఏంటి అంత మాట అన్నాడు… పాపం రష్మీ ఆవేశంలో పరువు పోగొట్టుకుందిగా!

ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చిన కొత్త కారుని గురువు శివాజితో ఓపెన్ చేయించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కింద నెటిజన్లు ప్రశాంత్ – శివాజీలను ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు. రైతు పేరు చెప్పుకుని గెలిచి ఇప్పుడు ఇలా చేయడం న్యాయమేనా అంటూ నిలదీస్తున్నారు. పల్లవి ప్రశాంత్ నిజ స్వరూపం ఇది అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by MALLA OCHINA (@pallaviprashanth_)

RELATED ARTICLES

Most Popular