Bigg Boss: ఒకరి వ్యక్తిగత జీవితం దగ్గరగా చూడాలనుకోవడం మానవ నైజం. ఇక సెలబ్రిటీల పర్సనల్ విషయాలంటే సాధారణ జనాల్లో మరింత ఆసక్తి ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటారు? ఏం చేస్తారు? ఏం తింటారు? ఎలా ఆలోచిస్తారు? తెలుసుకోవాలని అభిమానులకు ఉంటుంది. బిగ్ బాస్ రియాలిటీ షో బేసిక్ ఫార్ములా అదే. బుల్లితెర, వెండితెర మీద కనిపించిన ప్రముఖుల నిజ ప్రవర్తన నాలుగు గోడల మధ్య, పదుల కెమెరాల్లో బంధించి చూపిస్తారు. టాస్కులు, నామినేషన్స్, అభిప్రాయాలు… కంటెస్టెంట్స్ మధ్య గొడవలకు దారి తీస్తాయి.
బ్రిటన్ లో ప్రసారమైన బిగ్ బ్రదర్ షో బిగ్ బాస్ కి మూలం. బిగ్ బ్రదర్ షోలో ఇండియా నుండి పార్టిసిపేట్ చేసిన శిల్పా శెట్టి విన్నర్ గా నిలిచింది. బిగ్ బ్రదర్ రియాలిటీ షో కాన్సెప్ట్ ని బిగ్ బాస్ గా హిందీలో ప్రసారం చేశారు. గ్రాండ్ సక్సెస్ కావడంతో ప్రాంతీయ భాషలకు వ్యాపించింది. 2017లో ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇక్కడ కూడా సక్సెస్ కావడంతో వరుసగా 7 సీజన్స్ పూర్తి చేసుకుంది.
ఈ క్రమంలో బిగ్ బాస్ రివ్యూవర్స్ పుట్టుకొచ్చారు. ఒక సినిమా కథ, పాత్రలను విశ్లేషించినట్లు కంటెంట్స్ ప్రవర్తన, హోస్ట్ జడ్జిమెంట్ ని వీరు అనాలిసిస్ చేస్తారు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనేది ముందుగానే అంచనా వేస్తారు. కంటెస్టెంట్స్ లో ఎవరు ఫేక్? ఎవరు జెన్యూన్? వంటి విశ్లేషణలు ఇస్తారు. బిగ్ బాస్ సీజన్ మొదలవుతుంది అంటే వారికి పండగే. లక్షల సంపాదన వారి సొంతం.
తెలుగులో కొందరు ఫేమస్ బిగ్ బాస్ రివ్యూవర్స్ ఉన్నారు. వీరిని లక్షల మంది ఫాలో అవుతూ ఉంటారు. బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ రీత్యా వీరి రివ్యూలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. బిగ్ బాస్ రివ్యూవర్స్ లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు ఆదిరెడ్డి. సాదాసీదా ఉద్యోగం చేసుకుంటున్న ఆదిరెడ్డి మిత్రుల సలహా మేరకు బిగ్ బాస్ రివ్యూవర్ అయ్యాడు.
ఆదిరెడ్డి(Adireddy) టాప్ బిగ్ బాస్ రివ్యూవర్. ఇతని అనాలిసిస్ ఇష్టపడే ఆడియన్స్ ఉన్నారు. ఆదిరెడ్డి యూట్యూబ్ ఛానల్ ని 6 లక్షలకు పైగా ఫాలో అవుతున్నారు. వీడియో విడుదల చేసిన క్షణాల్లో వేలల్లో చూస్తారు. కామెంట్స్, లైక్స్ చేస్తుంటారు. గత సీజన్ లో ఆదిరెడ్డి పల్లవి ప్రశాంత్ కి అనుకూలంగా వీడియోలు చేశాడు. దాంతో డబ్బులు తీసుకుని రివ్యూలు ఇస్తున్నాడని కొందరు కామెంట్ చేశారు. నేను డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. నెలకు నా సంపాదన రూ. 39 లక్షలు అని ఆధారాలతో సహా ఆదిరెడ్డి చూపించాడు. ఆదిరెడ్డి బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇతడు ఫైనలిస్ట్ కూడాను.
లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న మరొక బిగ్ బాస్ రివ్యూవర్ గీతూ రాయల్(Geetu Royal). ఈమె కూడా బిగ్ బాస్ రివ్యూవర్ గా ఫేమస్ అయ్యింది. పలు సీజన్స్ కి ఆమె రివ్యూలు చెప్పింది. సోషల్ మీడియా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న గీతూ రాయల్ జబర్దస్త్ లో స్కిట్స్ చేసింది. సీజన్ 6లో పాల్గొన్న గీతూ రాయల్ 9వ వారం ఎలిమినేట్ అయ్యింది. గీతూ రాయల్ రివ్యూలు ఇష్టపడే బిగ్ బాస్ లవర్స్ చాలా మందే ఉన్నారు.
Also Read: Sudigali Sudheer: ఏంటి మీ బావలో అంత మేటర్ ఉందా? సుడిగాలి సుధీర్ షోలో యంగ్ యాంకర్స్ హాట్ కామెంట్స్
ఒకప్పుడు జబర్దస్త్ కమెడియన్ గా చేసిన మహిధర్(Mahidhar) సైతం బిగ్ బాస్ రివ్యూలు ఇస్తారు. ఇతడు సినిమా, క్రికెట్ రివ్యూవర్ కూడాను. మహిధర్ యూట్యూబ్ ఛానల్ ని లక్షన్నర మంది ఫాలో అవుతున్నారు. బిగ్ బాస్ రివ్యూవర్ గా మహిధర్ సంపాదన లక్షల్లో ఉంది.
బిగ్ బాస్ లవర్స్ ఫాలో అయ్యే మరొక రివ్యూవర్ స్పై అక్క. ఈమె ఎపిసోడ్స్ చూసి రీల్స్ చేస్తూ ఉంటుంది. కంటెస్టెంట్స్ ప్రవర్తన, ఎలిమినేషన్స్ మీద స్పై అక్క చేసే కామెంట్స్ వైరల్ అవుతుంటాయి. స్పై అక్క బిగ్ బాస్ రివ్యూలను ఇష్టపడే ప్రేక్షకులు వేలల్లో ఉన్నారు. అలాగే టాప్ వ్యూ ఛానల్ ద్వారా ఒకరు బిగ్ బాస్ రివ్యూలు ఇస్తారు. ఇక చిన్నా చితకా రివ్యూవర్స్ పదుల సంఖ్యలో ఉన్నారు. కేవలం బిగ్ బాస్ షో రివ్యూలు చెప్పి నెలకు లక్షలు, వేలు సంపాదింస్తున్నారు రివ్యూవర్స్.
Web Title: You will be shocked to know the earnings of bigg boss youtube reviewers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com