https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: వాళ్ళ మీద పగబట్టేసిన బిగ్ బాస్… గతంలో ఎన్నడూ జరగలేదే!

గత ఆరు వారాల్లో వరుసగా అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు. హౌస్ ని వీడే మొదటి మేల్ కంటెస్టెంట్ భోలే కావచ్చని అనుకున్నారు. అయితే ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ ఉంటుంది.

Written By: , Updated On : October 21, 2023 / 09:06 AM IST
Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు 7లో మరో ఎలిమినేషన్ కి సమయం ఆసన్నమైంది. వీకెండ్ వచ్చేయగా నాగార్జున ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఒక కంటెస్టెంట్ ని ఎగ్జిట్ చేయనున్నాడు. నామినేషన్స్ లో అమర్ దీప్, ప్రశాంత్, గౌతమ్, తేజా, పూజా, అశ్విని, భోలే ఉన్నారు. కొంచెం వింతగా ప్రవర్తిస్తున్న భోలేపై ఇంటి సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అమర్ దీప్, అర్జున్, ప్రియాంక, శోభా, సందీప్ అతన్ని నామినేట్ చేశారు. దీంతో దాదాపు భోలే ఇంటి బాట పట్టడం ఖాయం అనుకున్నారందరూ.

పైగా గత ఆరు వారాల్లో వరుసగా అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు. హౌస్ ని వీడే మొదటి మేల్ కంటెస్టెంట్ భోలే కావచ్చని అనుకున్నారు. అయితే ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ ఉంటుంది. పల్లవి ప్రశాంత్ అత్యధిక ఓట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడని సమాచారం. అతడికి 40% పైగా ఓట్లు పోల్ అయ్యాయట. నెక్స్ట్ సీరియల్ నటుడు అమర్ ఉన్నాడట. మిగతా ఐదు కంటెస్టెంట్స్ ఓటింగ్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయట.

ఎలిమినేట్ అవుతాడనుకున్న భోలే సేఫ్ జోన్లో ఉన్నాడని అంటున్నారు. గౌతమ్, తేజా కూడా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నట్లు వినికిడి. మరలా లేడీ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లోకి వచ్చారట. అశ్విని ఆరో స్థానంలో, పూజా ఏడవ స్థానంలో ఉన్నారట. వీరిద్దరిపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతుందట. దాదాపు పూజా ఎలిమినేట్ కావచ్చని అంటున్నారు.

మరి అదే జరిగితే ఊహించని పరిణామం అవుతుంది. వరుసగా మరో లేడీ కంటెస్టెంట్ ఇంటిని వీడినట్లు అవుతుంది. గత ఆరు సీజన్లో ఎన్నడూ ఇలా జరగలేదు. ఇక గత వారం ఎలిమినేట్ అయిన నయని పావని ఎలిమినేషన్ మీద వ్యతిరేకత వ్యక్తమైంది. హౌస్లో ఉన్న కొందరు హౌస్ మేట్స్ కంటే ఆమె చాలా బెటర్ అన్నమాట వినిపించింది. మరోవైపు ఎలిమినేటైన రతికా రోజ్ ఇంట్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.