Pallavi Prashanth Vs Rathika Rose: బిగ్ బాస్ సీజన్ 7 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . అందరూ ఈ రియాలిటీ షో ని బాగా ఆదరిస్తున్నారు . ఆరంభం నుంచి షో అత్యధిక రేటింగ్స్ తో దూసుకుపోతోంది. రోజుకో కొత్త కాన్సెప్ట్ తో అభిమానులకి ఫుల్ మీల్స్ వడ్డించేస్తుంది . ఇప్పుడు నాలుగో వారం జరుగుతుంది. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్స్ పవర్ అస్త్ర సాధించి హౌస్ మేట్స్ గా సెటిల్ అయ్యారు . ఇక నాలుగో పవర్ అస్త్ర కోసం పోటీ పడేందుకు ప్రిన్స్ ,శుభశ్రీ ,ప్రశాంత్ ఎంపికయ్యారు .
ఇందుకు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు . కదలకు రా వదలకు రా ఈ టాస్క్ లో కంటెండర్లు పవర్ అస్త్ర పట్టుకుని కదలకుండా నిల్చోవాలి. పట్టు వదలకుండా పవర్ అస్త్రని ఎక్కువ సేపు పట్టుకుని ఉన్న వారు గెలుస్తారని చెప్పాడు బిగ్ బాస్ . టాస్క్ మొదలైన కొద్ది సేపటికి కంటెస్టెంట్స్ తమకు నచ్చిన వాళ్ళను సపోర్ట్ చేసేందుకు వేరే వాళ్ళ దృష్టి మళ్లించవచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు .
దీంతో రతిక, అమర్ కలిసి తెగ ఓవర్ యాక్షన్ చేశారు. ప్రశాంత్ ని టార్గెట్ చేసి ఇండైరెక్ట్ గా దారుణంగా కామెంట్స్ చేస్తూ ,ఘోరంగా అవమానించారు . ఛీ ఛీ కొందరుంటారు . వాళ్ళకి అమ్మాయిలను గౌరవించడం కూడా తెలియదు .సిగ్గుండాలి ,అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా పెంచారో .ఆ మీసాలు ,గడ్డాలు ఉన్నా వేస్ట్ అంటూ పెద్ద పెద్ద మాటలు అనేసింది . నోటికొచ్చిందల్లా వాగుతూ రెచ్చి పోయారు అమర్ ,రతిక . ఎన్ని మాటలు అన్నా చలించకుండా తగ్గేదే లే అన్నట్టు మీసం మెలేసాడు ప్రశాంత్ .
కొంత సమయానికి కంటెండర్లు ముగ్గురు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో టాస్క్ రద్దు చేసి కొత్త టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ . ఆ టాస్క్ లో గెలిచిన ప్రశాంత్ ,పవర్ అస్త్ర సాధించి ,ఇంటి నాలుగో హౌస్ మేట్ గా నిలిచాడు . రెండు వారల ఇమ్మ్యూనిటీ పొందాడు. తన సత్తా చాటుకున్నాడు .