Bigg Boss 7 Telugu Shakeela: బిగ్ బాస్ తెలుగు 7 ఆరంభం బాగానే ఉంది. కొంచెం పేరున్న కంటెస్టెంట్స్ ఉన్నారు. అలాగే టాస్క్స్ కొత్తగా ఉన్నాయి. ఇంట్లో ఫర్నిచర్ లేకుండా చేసిన బిగ్ బాస్ కొందరితో జాగారం చేయిస్తున్నాడు. ఏది కావాలన్నా కష్టపడి సంపాదించుకోవాలి అన్నట్లు పరిస్థితి ఉంది. ఈ సీజన్ కంటెస్టెంట్స్ లో టేస్టీ తేజా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాడు. బేసిక్ గా యాంకర్ కావడంతో త్వరగా కలిసిపోతున్నాడు. అందరితో మాట్లాడుతున్నాడు. బిగ్ బాస్ షోకి కావాల్సింది ఇదే. మౌనంగా ఉంటూ తమ పని తాము చేసుకుంటే ప్రేక్షకులు పట్టించుకోరు. నిర్వాహకులు కూడా సంతృప్తి చెందరు.
టాస్క్స్ లో భాగంగా అక్కడి మాటలు ఇక్కడ… ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ గొడవలు కూడా పెడుతున్నాడు. ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణలకు గొడవ పెట్టడంలో సక్సెస్ అయ్యాడు. ఇదిలా ఉంటే నటి షకీలను మాటల్లో మాటగా ఇంటర్వ్యూ చేశాడు. ఆమె నుండి ఆసక్తికర సమాచారం రాబట్టాడు. ఫ్లోలో ఆమె కూడా తేజా ప్రశ్నలకు సమాధానం చెప్పింది.
మీరు అడల్ట్ కంటెంట్ చిత్రాలు ఎందుకు చేశారు? అని తేజా అడగ్గా… నాకు అలాంటి చిత్రాల్లోనే ఆఫర్స్ వచ్చాయి. మొదట్లో చిన్న చిన్న గ్లామర్ రోల్స్ చేశాను. తర్వాత అడల్ట్ కంటెంట్ చిత్ర కోసం నన్ను సంప్రదించారు. నిక్కర్లు వేసుకుని డాన్సులు చేస్తే తప్పుకానప్పుడు అడల్ట్ కంటెంట్ చిత్రాలు చేస్తే తప్పేంటి అని ఆమె అన్నారు. మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమీ అనలేదా? అని మరో ప్రశ్న అడిగారు. బాగా డబ్బులు వచ్చేవి. అందుకే వాళ్ళు కూడా ఏమనలేదు, అని షకీలా చెప్పారు.
ఎన్ని సినిమాలు చేశారు అంటే… 500 చిత్రాలకు పైగా చేశానని షకీలా చెప్పింది. అయినా నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావేంటీ అని అనడంతో తేజా అంతటితో తన ప్రశ్నలు ఆపేశాడు. కోట్ల రూపాయలు సంపాదించిన షకీలా తన చెల్లి చేతిలో మోసపోయింది. ఆస్థి మొత్తం పోగొట్టుకుంది. ఈ విషయాన్ని లాంచింగ్ ఎపిసోడ్ ఆమె ఇంట్రో వీడియోలో చెప్పుకుని బాధపడింది. గతంలో షకీలా కన్నడ బిగ్ బాస్ షోలో పాల్గొంది. అయితే పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.