Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. కాగా ఇప్పటికే సగానికి పైనే ఆట పూర్తయింది. ఇప్పుడు 12వ వారం లో అడుగు పెట్టింది. అయితే ఈ వారం నామినేషన్స్ లో వేడి మామూలుగా లేదు. కంటెస్టెంట్స్ ఓ రేంజ్ లో కొట్లాడుకున్నారు. నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయానికి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, రతిక రోజ్, అశ్విని శ్రీ, అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు.
ఇక మంగళవారం రాత్రి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. కాగా ఈ వారం భారీ స్థాయిలో ఓటింగ్ నమోదవుతుంది. రైతు బిడ్డ ప్రశాంత్ కి బాగా ఆదరణ లభిస్తుంది. ప్రశాంత్ కి ఒక్కడికే దాదాపు 34 శాతం ఓటింగ్ నమోదు కాగా మొదటి స్థానంలో ఉన్నాడు. ఎప్పుడు నామినేషన్స్ లో ఉన్న టాప్ లో ఉండే శివాజీ ఈ వారం రెండో స్థానంలో పడిపోవడం ఆశ్చర్యం. ఇక అమర్ దీప్ 17 శాతం ఓటింగ్ తో మూడో ప్లేస్ లో కొనసాగుతున్నాడు.
ఆ తర్వాత యావర్ 10 శాతం ఓటింగ్ తో నాలుగవ స్థానంలో ఉన్నాడు. ఇక 5 శాతం ఓటింగ్ నమోదు చేసుకున్న గౌతమ్ ఐదవ స్థానంలో నిలిచాడు. ఇక చివరి మూడు స్థానాల్లో రతిక, అర్జున్, అశ్విని ఉన్నారు.కాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న అర్జున్ అతి తక్కువ ఓటింగ్ తో చివరి నుంచి రెండో స్థానానికి పడిపోయాడు. రతిక మాత్రం 4 శాతం ఓట్లతో ఆరో పొజిషన్ లో ఉంది. అశ్విని కేవలం 2 శాతం ఓట్లతో ఎనిమిదో స్థానం అంటే అందరికంటే చివర్లో ఉంది.
కాగా అశ్విని, అర్జున్ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట. ఇందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన అర్జున్ డేంజర్ జోన్ లో కి రావడం మాత్రం ఊహించని పరిణామం. అశ్విని మాత్రం గత వారం కూడా డేంజర్ జోన్ లో నే ఉంది. వారం మొత్తం ఆటని బట్టి వీటిలో మార్పులు జరిగే అవకాశం ఉంది. అర్జున్ కి ఎలాగైనా కాస్తో కూస్తో ఓట్లు పడి సేవ్ అవుతాడు. కానీ ఈ వారం డబల్ ఎలిమినేషన్ జరిగితే మాత్రం అశ్విని , రతిక లు ఎలిమినేట్ అవ్వడం ఖాయం. చూడాలి మరి ఏం జరగనుందో.