Bigg Boss 7 Telugu – Shivaji : బిగ్ బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచారు. ఫైనల్ లో టాప్ 3గా పల్లవి ప్రశాంత్, అమర్, శివాజీ నిలిచారు. బిగ్ బస్ హిస్టరీలోనే తొలిసారి ఒక సామాన్యుడు.. ఒక రైతు బిడ్డ విజేతగా నిలిచాడు.ఇక బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు విజేతగా చివరకు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచి గ్రాండ్ గా టైటిల్ గెలుచుకున్నాడు.
బిగ్ బస్ హిస్టరీలోనే తొలిసారి ఒక సామాన్యుడు.. ఒక రైతు బిడ్డ విజేతగా నిలిచాడు. నిజానికి ఇలా నిలిపింది కేవలం నటుడు శివాజీనే. తొలి వారం నుంచే ఎవరూ మాట్లాడకుండా సామాన్యుడిలా ఉన్న పల్లవి ప్రశాంత్ ను వెనకేసుకొచ్చి అతడిని సానబట్టి ఫైనల్ వరకూ తీసుకొచ్చి విజేతగా నిలిపింది శివాజీ.
అందుకే శివాజీ 3వ టాప్ 3గా ఎలిమినేట్ అయ్యాక అతడి కొడుకు స్టేజీపైనే ఏడ్చేశాడు. విజేత కావాల్సిన శివాజీ ఓడిపోవడానికి కారణం పల్లవి ప్రశాంత్ నే. ప్రశాంత్ ను పైకి లేపి శివాజీ అన్యాయమైపోయాడు..
నిజానికి విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ కు కేవలం 35 లక్షల నగదు, కారు, ఓ గోల్డ్ చైన్ దక్కగా.. శివాజీకి వారానికి 4 లక్షల చొప్పున మొత్తం 15 వారాలకు 60 లక్షల రెమ్యూనరేషన్ దక్కింది. అంటే విజేతకు లభించిన నగదు కంటే డబుల్ గానే శివాజీకి దక్కింది. విజేతగా నిలవకపోయినా రెమ్యూనరేషన్ పరంగా శివాజీ ఇంత సంపాదించడం విశేషం.