Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ ఉత్కంఠగా సాగుతుంది. నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయారు. మొదటి వారం కిరణ్ రాథోడ్ ,రెండో వారం షకీలా,మూడవ వారం సింగర్ దామిని,నాలుగో వారం రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యారు. రతిక ఎలిమినేషన్ ఎవరు ఊహించలేదు. టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అనుకున్న రతిక నాలుగో వారం ఎలిమినేట్ కావడం అందరిని షాక్ కి గురి చేసింది.
రతికా హౌస్ లోకి రావడంతోనే అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ప్రశాంత్ తో ప్రేమాయణం నడిపింది. మొదట్లో ఆమెను ఆడియన్స్ బాగా ఆదరించారు. నామినేషన్ లో ఉన్న ప్రతి సారి సేఫ్ చేశారు. కానీ రతిక చేసిన పొరపాట్లు ఎలిమినేషన్ వరకు తీసుకొచ్చాయి. ఆమె పల్లవి ప్రశాంత్ తో ప్రవర్తించిన తీరు ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చలేదు.అనవసరంగా ప్రశాంత్ ని లేని పోనీ మాటలంటూ ఘోరంగా అవమానించింది. దీంతో ఆడియన్స్ లో ఆమె విపరీతమైన నెగిటివిటీ మూటగట్టుకుంది. రతికని ఎలిమినేట్ చెయ్యాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేయడమైంది.
రతిక హౌస్ నుండి బయటకు వచ్చినప్పటి నుంచి రోజు ఏదో వార్త ఆమె గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఆమె మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఇదే కనుక నిజమైతే ఇక ఫ్యాన్స్ కి పండగే. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మినీ లాంచ్ వరకు ఎదురు చూడాల్సిందే.
అక్టోబర్ 8న మినీ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. దాదాపు 7 కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంబటి అర్జున్, పూజా మూర్తి దాదాపు ఖాయం అంటున్నారు. జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అనూహ్యంగా రతికా రోజ్, దామిని రీఎంట్రీ ఇవ్వొచ్చు అంటున్నారు.