Bigg Boss 7 Telugu: నాగార్జున శనివారం ప్రవర్తించిన తీరు ఎవరికీ నచ్చలేదు. తప్పులు చేసిన స్పా బ్యాచ్ ని వదిలేసి స్పై బ్యాచ్ ని ఆయన టార్గెట్ చేశాడు. పల్లవి ప్రశాంత్ ని విమర్శించిన తీరు ఎవరికీ నచ్చలేదు.
శనివారం ఎపిసోడ్లో నాగార్జున ప్రవర్తించిన విమర్శలపాలైంది. ఆయన కేవలం స్పై బ్యాచ్ ని టార్గెట్ చేశాడనే మాట వినిపించింది. తప్పు చేసిన అమర్ దీప్ ని కాదని నాగార్జున యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్ లను ఎక్కువగా తిట్టాడు. అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ పట్ల హద్దులు దాటి ప్రవర్తించినా పెద్దగా రియాక్ట్ కాలేదు. చిన్న చిన్న తప్పులకు యావర్, ప్రశాంత్ లను విమర్శించాడు. శివాజీ అన్న మాటలు తప్పే, కానీ యావర్, ప్రశాంత్ లను నాగార్జున ఆ స్థాయిలో విమర్శించాల్సింది కాదు.
అదే సమయంలో శోభ, అమర్ తప్పులను నాగార్జున ఎత్తి చూపాడు. గత వారం అమర్ ఆవేశంలో పిచ్చిగా ప్రవర్తించాడు. పల్లవి ప్రశాంత్ ని లెక్క చేయకుండా మాట్లాడాడు. అతని మీద ఫిజికల్ అటాక్ కూడా చేశాడు. అమర్ ని నాగార్జున ఏకీ పారేస్తాడు అనుకుంటే అది జరగలేదు. శనివారం ఎపిసోడ్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు.
నాగార్జున అంతా రివర్స్ లో చేశాడు. గట్టిగా తిట్టాల్సిన వాళ్ళను వెనకేసుకొచ్చాడు. పల్లవి ప్రశాంత్ కేవలం శివాజీకి సేవలు చేశాడని తప్పుబట్టారు. దీంతో సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వినిపించాయి. దీంతో ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున వర్షన్ మారిపోయింది. శివాజీని ఆయన పొగడటం షాక్ కి గురి చేసింది. అది కూడా శివాజీ చేసింది తప్పు అన్న నాగార్జున, ఇప్పుడు అది రైట్ అంటున్నాడు.
నాగార్జునపై విపరీతమైన విమర్శలు వినిపించిన నేపథ్యంలో ఆయన వెర్షన్ మార్చాడని పలువురు అనుకుంటున్నారు. మరోవైపు నాగార్జున సీరియల్ బ్యాచ్ అమర్ దీప్, ప్రియనక, శోభలకు ఫేవర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా ఆదివారం శోభ ఎలిమినేట్ అయ్యింది. మిగిలిన ఆరుగురు ఫైనలిస్ట్స్ అని నాగార్జున ప్రకటించారు. ఈ సీజన్లో టాప్ 6 ఫైనల్ కి వెళ్లారు.