Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మర్డర్ మిస్టరీ కొనసాగుతుంది. ఇందులో భాగంగా శివాజీ కి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనికి శివాజీ ముగ్గురిని హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడాలి.కాగా ఇప్పటికే ప్రశాంత్ ని .. తాజాగా అశ్విని ని కూడా చంపేసి తప్పించుకుని తిరుగుతున్నాడు శివాజీ. అయితే హౌస్ ఉన్న వాళ్లకి శివాజీ పై అనుమానం వచ్చేసింది.ఇక తాజా ఎపిసోడ్లో శివాజీ ని ఇన్వెస్టిగేట్ చేశారు పోలీసులు అర్జున్ అమర్ దీప్.
తర్వాత కూలోడు పాత్రలో నటిస్తున్న గౌతమ్ ని ప్రశ్నించారు. అయితే గౌతమ్ .. గులాబీ దగ్గర డ్రైవింగ్ లైసెన్సు లేదని చెప్పాడు. ఇక తర్వాత మర్డర్ చేసింది ఎవరో చెప్పాలని కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్స్ ని అడిగారు బిగ్ బాస్. దీంతో అర్జున్ .. శివాజీ పేరు చెప్పాడు. నేను మర్డర్ చేశానని ప్రూఫ్ ఏంటి అని శివాజీ అడిగాడు. ‘ చాణక్యుడిలా ప్లాన్లు వేసి ఏమైనా చేయగల సమర్ధుడనే ఉద్దేశ్యంతో అతన్ని జైల్లో వేస్తున్నాం అని అర్జున్ చెప్పాడు.
దీంతో సీక్రెట్ టాస్క్ లో శివాజీ విఫలమైనట్లు బిగ్ బాస్ చెప్పారు. కాబట్టి తర్వాత మర్డర్స్ అన్ని ప్రియాంక చేయాల్సి ఉంటుంది అని .. దీనిలో భాగంగా ఫోన్ ని ప్రియాంక కి ఇచ్చి .. ఆమె చేయాల్సిన హత్యల గురించి చెప్పాలని బిగ్ బాస్ చెప్పారు. ఇక శివాజీ .. నీకు ఒక ఫోన్ ఇస్తా .. నువ్వు గౌతమ్ కి స్టిక్కర్ వేయాలి అని ప్రియాంక తో చెప్పాడు. అయితే చాలా సింపుల్ గా తన ఫస్ట్ మర్డర్ చేసింది ప్రియాంక.
కిచెన్ లో ఉన్న గౌతమ్ కి సైలెంట్ గా స్టిక్కర్ వేసేసి టాస్క్ కంప్లీట్ చేసింది. దీంతో గౌతమ్ డెడ్ అయ్యాడు. ఇంట్లో మరో హత్య జరిగింది అంటూ బిగ్ బాస్ ప్రకటించారు. మరి ప్రియాంక చివరి వరకు దొరకకుండా సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసింది. శివాజీ అరెస్ట్ భయంతో బాత్ రూమ్ లో దాక్కున్నాడు. అయితే చివరికి లొంగిపోయాడు. ఇలాంటి ఆసక్తికర పరిణామాలతో ఎపిసోడ్ ముగిసింది.