https://oktelugu.com/

Tamannaah Bhatia: టైట్ డ్రెస్ లో తమన్నా హాట్ షో… వైరల్ గా మిల్కీ బ్యూటీ బోల్డ్ ఫోటో షూట్!

రజినీకాంత్ జైలర్ మూవీలో ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేసింది. కనిపించింది కొద్ది నిమిషాలే అయినా రచ్చ చేసింది. తమన్నా 'నువ్వు కావాలయ్యా' సాంగ్ విపరీతమైన ఆదరణ దక్కించుకుంది.

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2023 / 09:28 AM IST

    Tamannaah Bhatia

    Follow us on

    Tamannaah Bhatia: తమన్నా కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. స్టార్ హీరోయిన్ గా రిటైర్ అయినా ఆఫర్స్ ఏమాత్రం తగ్గడం లేదు. అటు సిల్వర్ స్క్రీన్ పై,ఇటు డిజిటల్ సిరీస్లలో రాణిస్తుంది. ఈ ఏడాది ఇద్దరు టాప్ స్టార్స్ చిత్రాల్లో తమన్నా నటించింది. చిరంజీవికి జంటగా భోళా శంకర్ చిత్రం చేసింది. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా శంకర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. చిరంజీవితో తమన్నాకు ఇది రెండో చిత్రం. గతంలో సైరా చిత్రంలో జంటగా నటించారు.

    అలాగే రజినీకాంత్ జైలర్ మూవీలో ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేసింది. కనిపించింది కొద్ది నిమిషాలే అయినా రచ్చ చేసింది. తమన్నా ‘నువ్వు కావాలయ్యా’ సాంగ్ విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ఈ సాంగ్ లో తమన్నా బోల్డ్ స్టెప్స్ వైరల్ అయ్యాయి. జైలర్ ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంతో రజినీకాంత్ తన స్థాయి హిట్ కొట్టాడు.

    ఇక లస్ట్ స్టోరీస్ 2, జీకర్దా వంటి డిజిటల్ సిరీస్లు చేసింది. సదరు సిరీస్లలో తమన్నా బోల్డ్ సీన్స్ లో రచ్చ చేసింది. ముద్దు సన్నివేశాలు, బెడ్ రూమ్ సన్నివేశాల్లో మొహమాటం లేకుండా నటించింది. ఇదే విషయం అడిగితే… ఈ రోజుల్లో కూడా ముద్దు సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది. కథ డిమాండ్ చేసినప్పుడు తప్పదు అని ఆమె చెప్పుకొచ్చారు.

    మరోవైపు తమన్నా పెళ్లి రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తమన్నా వివాహం చేసుకునే అవకాశం కలదంటున్నారు. తమన్నా నటుడు విజయ్ వర్మతో ఎఫైర్ లో ఉంది. ఓ ఏడాది కాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు. లస్ట్ స్టోరీస్ 2లో విజయ్ వర్మ, తమన్నా కలిసి నటించారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారట. ఇటీవల తాము రిలేషన్ లో ఉన్నట్లు ఒప్పుకున్నారు.

    మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేస్తుంది. తాజాగా టైట్ బాడీ కాన్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది. క్లీవేజ్ అందాలతో నెటిజెన్స్ ని ఆకర్షించింది. తమన్నా బోల్డ్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.