Bigg Boss 7 Telugu Grand Finale: బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలేకి మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఆదివారం రాత్రి 7 గంటల నుండి ప్రసారం కానుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరు కానున్నారనే ఉత్కంఠ నెలకొంది. ప్రతి సీజన్లో ఒకరి పేరు గట్టిగా విపించేది. దాదాపు ఆ కంటెస్టెంట్ విన్నర్ అయ్యేవాడు. ఈసారి ఎలాంటి లీక్స్ లేవు. ఫైనల్ వీక్ లో ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపేవారు. దాని వలన టాప్ 5 కంటెస్టెంట్స్ కి విన్నర్ ఎవరనేది తెలిసిపోతుంది. దీంతో టైటిల్ రేసులో లేమని తెలిసిన కంటెస్టెంట్స్ డబ్బులు తీసుకుంటున్నారు.
అందుకే ఈసారి ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని లోపలికి మరలా పంపలేదు. ఇక గ్రాండ్ ఫినాలే షూట్ కూడా ముగిసింది. దీంతో కొంత సమాచారం బయటకు వస్తుంది. ఎప్పటిలాగే అదిరిపోయే పెర్ఫార్మన్స్లు ఉన్నాయట. హీరోయిన్ నిధి అగర్వాల్ తో ఒక సాంగ్ ఉంటుందట. అలాగే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారట.
శుభశ్రీ, శోభ శెట్టి, ఆట సందీప్, నయని పావనిలు డాన్స్ పర్ఫార్మ్ చేయనున్నారట. అలాగే భోలే షావలి సింగింగ్ పెర్ఫార్మన్స్ ఉంటుందట. నాగార్జున పక్కా ప్లాన్ తో గ్రాండ్ ఫినాలే భారీ సక్సెస్ చేయనున్నాడని సమాచారం. ఇక ఫినాలే గెస్ట్ గా హీరో మహేష్ బాబు వస్తున్నారని ప్రచారం జరిగింది. అలాగే బాలయ్య పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ మాస్ మహరాజ్ రవితేజ రాబోతున్నాడని టాక్. తాజా సమాచారం ప్రకారం గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా రవితేజ వేదిక మీద సందడి చేయనున్నారు.
14 మందితో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైంది. ఐదు వారాల అనంతరం మరో ఐదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, శుభశ్రీ, నయని పావని, పూజ మూర్తి, ఆట సందీప్, టేస్టీ తేజా, భోలే షావలి, అశ్విని, రతిక రోజ్, గౌతమ్, శోభ శెట్టి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం అర్జున్, అమర్, శివాజీ, ప్రశాంత్, యావర్, ప్రియాంక ఫైనలిస్ట్స్ గా ఉన్నారు. వీరిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు.