Charmy Kaur Marriage: టీనేజ్ లోనే హీరోయిన్ గా మారిన ఛార్మి టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగింది. గౌరీ, మాస్, లక్ష్మీ, స్టైల్, రాఖీ వంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ తో ఛార్మి జతకట్టింది. 2015లో ఛార్మి సడన్ గా నటనకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఆమె నిర్మాతగా ఉంది. దర్శకుడు పూరి జగన్నాధ్ తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో ఒక బ్యానర్ ఏర్పాటు చేసి చిత్రాలు నిర్మిస్తుంది.
పూరి కనెక్ట్స్ బ్యానర్ లో జ్యోతి లక్ష్మి, రోగ్, పైసా వసూల్, మెహబూబ, ఇస్మార్ట్ శంకర్, లైగర్ వంటి చిత్రాలు తెరకెక్కాయి. ఇస్మార్ట్ శంకర్ మినహాయిస్తే ఒక్క చిత్రం ఆడిన పాపాన పోలేదు. ఇస్మార్ట్ శంకర్ నాటికి పూరి-ఛార్మి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఉన్నవన్నీ ఊడ్చి ఇస్మార్ట్ శంకర్ చేశారు. అనూహ్యంగా ఆ మూవీ మంచి విజయం సాధించింది. వరల్డ్ వైడ్ రూ. 75 కోట్ల గ్రాస్ రాబట్టింది.
దాంతో తిరిగి మొత్తం రాబట్టుకున్నారు. అయితే లైగర్ తో మరోసారి దెబ్బ పడింది. భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా మూవీ లైగర్ డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలు చెల్లించాలంటూ నానా యాగీ చేశారు.ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ మూవీలో మరోసారి సారి రామ్ పోతినేని నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే 36 ఏళ్ల ఛార్మి ఇంకా వివాహం చేసుకోలేదు. ఆమె దర్శకుడు పూరి జగన్నాధ్ తో సహజీవనం చేస్తున్నారనే పుకార్లు ఉన్నాయి.
అలాగే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో కూడా ఆమె ఎఫైర్ నడిపారని అంటారు. మరి ఛార్మి పెళ్లి చేసుకుంటుందా లేదా? అలాగే బ్యాచ్ లర్ గా ఉండిపోతుందా అనే సందేహాలు ఉన్నాయి. ఇటీవల మీ పెళ్లి ఎప్పుడని అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పింది. నాకు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం. ఆయనకు పెళ్ళైన విషయం తెలుసుకుని చాలా బాధపడ్డాను. ప్రస్తుతం ఆయన విడాకులు తీసుకున్నారు. ఆయన రెండో పెళ్లి చేసుకుంటే నేను కూడా పెళ్లి చేసుకుంటాను, అని హృతిక్ రోషన్ పెళ్లితో ముడిపెట్టింది. పరోక్షంగా ఆమె ఇక పెళ్లి చేసుకునేది లేదని హింట్ ఇచ్చింది.