Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హిస్టరీలో గౌతమ్ కృష్ణ తీసుకున్న నిర్ణయం ప్రశంసలు అందుకుంటుంది. ఆడియన్స్ లో ఆయనకు ఫుల్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ సీజన్ 7 ఫస్ట్ కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. తర్వాత యావర్ కెప్టెన్ అయ్యాడు. మూడో కెప్టెన్ గా అర్జున్ ఎంపికయ్యాడు. ఇక నాలుగో కెప్టెన్సీ కంటెండర్ రేసులో ప్రశాంత్, శోభా, సందీప్, గౌతమ్, ప్రియాంక నిలిచారు. హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం గౌతమ్ కి అవకాశం దక్కింది.
కెప్టెన్ గా ఎంపికైన గౌతమ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను కెప్టెన్ గా ఉండే ఈ వారం రోజులు ఆడవాళ్లకు సెలవు అన్నాడు. లేడీ హౌస్ మేట్స్ ఎవరూ పనులు చేయాల్సిన అవసరం లేదన్నాడు. ఇంట్లో అమ్మ, భార్య నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. మనకు కావాల్సినవి సమకూరుస్తారు. మహిళల త్యాగానికి గుర్తుగా ఈ వారం హౌస్లో ఉన్న అమ్మాయిలు పని చేయాల్సిన అవసరం లేదని గౌతమ్ కృష్ణ ఇంటి సభ్యులతో చెప్పాడు.
గౌతమ్ నిర్ణయానికి ఇంటి సభ్యులు ఓకే చెప్పారు. ప్రస్తుతం హౌస్లో శోభా, ప్రియాంక, అశ్విని, రతిక ఉన్నారు. వీరికి వన్ వీక్ విశ్రాంతి లభిస్తుందన్న మాట. ఇక సెలవు ప్రకటించినా… ప్రియాంక వంట చేయడం మానలేదు. వంట వార్పు వంటి చిన్న చిన్న విషయాల్లో అమ్మాయిలు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తుంది. గౌతమ్ నిర్ణయం మాత్రం చరిత్రాత్మకం. గత ఆరు సీజన్లో ఎవరూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇతర భాషల్లో కూడా జరిగి ఉండకపోవచ్చు.
ఈ పరిణామం గౌతమ్ కి జనాల్లో పాపులారిటీ పెంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా గౌతమ్ ఆల్రెడీ 5వ వారం ఎలిమినేట్ అయ్యాడు. నాగార్జున అతనికి మరొక ఛాన్స్ ఇచ్చాడు. సీక్రెట్ రూమ్ కి పంపాడు. తిరిగి వచ్చిన గౌతమ్… తనని తాను అశ్వద్ధామగా ప్రకటించుకున్నాడు. గౌతమ్ 2.0 ఇకపై నా సత్తా చూస్తారని శబధం చేశాడు. మొత్తానికి హౌస్ కి కెప్టెన్ అయ్యాడు. హౌస్లో ఉన్నన్ని రోజుల్లో ఒక్క వారమైనా కెప్టెన్సీ చేయాలని ప్రతి కంటెస్టెంట్ కోరుకుంటాడు. గౌతమ్ అది సాధించాడు.