Bigg Boss 7 Telugu: ఎందుకు మాట తప్పావు… శివాజీని ఏకిపారేసిన నాగార్జున!

అమర్ అద్దం ముందు నిలబడి ఉన్న ఛాన్స్ కూడా పోయిందే అంటూ ఏడుస్తున్నాడు. అమర్ సింపతీ గేమ్ ఆడొద్దని చెప్పింది నువ్వే కదా మరి ఏంటి ఇది అని అడిగారు.

Written By: NARESH, Updated On : November 26, 2023 10:08 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో 12 వ వారం కెప్టెన్సీ టాస్క్ లో హైడ్రామా నడిచింది. ముఖ్యంగా అమర్ దీప్ – శివాజీ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. కాగా దీని గురించి నాగార్జున అమర్ – శివాజీ లను నిలదీశారు. శనివారం ఎపిసోడ్లో ముందు అమర్ ని నిల్చోబెట్టి ఓ వీడియొ చూపించారు నాగార్జున. ఇందులో అమర్ అద్దం ముందు నిలబడి ఉన్న ఛాన్స్ కూడా పోయిందే అంటూ ఏడుస్తున్నాడు. అమర్ సింపతీ గేమ్ ఆడొద్దని చెప్పింది నువ్వే కదా మరి ఏంటి ఇది అని అడిగారు.

ఇది డ్రామా కాదు సార్ .. నమ్మిన వాళ్ళే మాట తప్పే సరికి అనుకోకుండా అలా ఏడుపు వచ్చేసింది. .. నేను బయట కూడా అలానే ఉంటాను అని అమర్ చెప్పాడు. సరే ఈ విషయం పై శివాజీనే క్లారిటీ అడుగుదాం అని నాగార్జున చెప్పారు. శివాజీ చెప్పు .. అమర్ ని కెప్టెన్ చేస్తానని మాటిచ్చావ్ మరి ఎందుకు తప్పావు అంటూ అడిగారు నాగ్. దీంతో శివాజీ అవును సార్ .. అప్పుడు కూడా డిప్యూటీలని ఎవరిని పెట్టుకుంటావు అని అడిగితే .. వాళ్లనే చెప్పాడు.

అందుకే ఇక అనవసరం అని అంటూ శివాజీ అన్నాడు. దీంతో నాగార్జున ‘ డిప్యూటీలుగా శోభా, ప్రియాంక లను పెట్టుకుంటే ఏమైంది … నీకు ఎందుకు ప్రాబ్లమ్ అని అడిగారు. ఇక శివాజీ ‘ బాగోలేదు సార్ .. న్యాయంగా బాలేదు అంటూ అన్నాడు. ‘ నువ్వు ప్రశాంత్, యావర్ ని తీసుకున్నప్పుడు తను వాళ్ళిద్దరిని తీసుకుంటే తప్పేంటి అని నిలదీశారు నాగార్జున. ఇంతలో అమర్ సార్ యావర్ అయినప్పుడు వాళ్లలోనే ఎలా తీసుకున్నాడో తర్వాత శివాజీ అన్న కూడా వాళ్లనే తీసుకున్నాడు అని అమర్ చెప్పాడు.

అయితే నాగార్జున ‘ నువ్వు కెప్టెన్ అయిన వాళ్ళని అవ్వనివ్వనని చెప్పావు కదా. మరి డిప్యూటీ లైతే ఓకేనా అంటూ అమర్ ని ప్రశ్నించారు. చివరికి బ్యాడ్జ్ ముఖ్యం కాదు అమర్, ఇక కెప్టెన్సీ బ్యాడ్జ్ లేదు. బ్యాడ్జ్ కాదు కప్పు ముఖ్యం. దాని కోసం ఆడు అంటూ నాగార్జున అన్నారు.