Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఎన్నో అంచనాలతో మొదలైన ఈ రియాలిటీ షో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది . రేటింగ్స్ కూడా బారి స్థాయిలో నమోదు చేసుకుంటుంది. ప్రతి సీజన్ తో పోల్చుకుంటే ఈ సారి కేవలం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్ లోకి అడుగుపెట్టారు . ఇది నాలుగో వారం కావడం తో ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్స్ హౌస్ కి గుడ్ బాయ్ చెప్పారు. ఇక మిగిలిన వారు తమదైన శైలిలో ఆట ఆడుతూ హౌస్ లో స్థానం పదిలం పరుచుకునే ప్రయత్నం లో నానా తిప్పలు పడుతున్నారు
వారిలో ఒకడు టేస్టీ తేజా , ఇంట్లో అడుగు పెట్టిన మొదటి రోజు నుండి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం లో వెనకడుగు వేయలేదు. అందరినీ నవ్విస్తూ ,సరదాగా కలిసిపోతూ బెస్ట్ ఎంటర్టైనర్ అనిపించుకున్నాడు . ఫిసికల్ టాస్క్ లో పెద్దగా ఆడలేకపోయిన,తెలివిగా సాగిపోతున్నాడు తేజా . ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు . అందరితో గౌరవంగా ఉంటూ,అప్పుడప్పుడు పంచులు వేస్తూ కామెడీ పండిస్తున్నాడు . పొగడ్తలతో పాటు విమర్శలు కూడా తేజ కి తప్పలేదు .ఈ వారం నామినేషన్స్ లో కాస్త అతి చేసాడు తేజ దీంతో నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ చేశారు.
ఇంట్లో వున్నా వారందరికంటే తేజా శోభా తో బాగా కనెక్ట్ అయ్యాడు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు . ఎక్కువ సమయం శోభతో ఉంటూ , తాను చెప్పినట్టే వింటున్నాడు తేజ . తాజాగా జరిగిన బ్యాంకర్స్ టాస్క్ లో అందరికంటే ముందు బజర్ కొట్టి కంటెండెర్ అవుతాను అని శోభా తో ఛాలెంజ్ చేసాడు తేజ . దానికి శోభాశెట్టి నువ్వు ఆ రౌండ్ లో అయినా బజర్ కొడితే నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను అంది. తేజా టాస్క్ లో ఓడిపోతాడు .
నన్ను ఓదార్చండి ఒక హగ్ ఇవ్వమంటూ ,రతిక ని శోభాశెట్టి ని అడిగాడు తేజా . అప్పుడు శోభా బిగ్ బాస్ చూడండి . తేజా నన్ను టచ్ చేస్తున్నాడు ,ఫిసికల్ అబ్యూస్ చేస్తున్నాడు . హగ్ ఇవ్వాలంట ,రతికని కూడా అడిగాడు బిగ్ బాస్ అని కంప్లైంట్ చేసింది . నాతో అసభ్యంగా ప్రవర్తిస్తన్నాడు అని చెప్పింది . శోభా ,రతిక తేజాని ఆడేస్కున్నారు . అయ్యో నేనేం చెయ్యలేదయ్యా ఇన్ని కెమెరాలు ఉన్నాయి . వాళ్ళు కావాలనే నా మీద ఆరోపణలు చేస్తున్నారు . నేను అభాగ్యుడని అని తేజ బిగ్ బాస్ కి చెప్పాడు .