bigg boss 7 telugu1
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 లో కొత్తగా ఐదుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. వారిని పోటుగాళ్ళు గా,పాత కంటెస్టెంట్స్ ని ఆటగాళ్లు గా విభజించారు బిగ్ బాస్. ఇరు టీమ్స్ లో ఎవరు గొప్ప అని తేల్చుకోవడానికి కొన్ని టాస్కులు ఇస్తూ వస్తున్నాడు. మొదటి టాస్క్ ఎవరు ఫిట్టెస్ట్. ఈ టాస్క్ ఆటగాళ్ల నుంచి యావర్,సందీప్ ఆడారు. పోటుగాళ్లు నుంచి అర్జున్ ఇంకా భోలే ఆడారు. ఇందులో పోటుగాళ్ళు పై చెయ్ సాధించారు.
ఇక రెండవది ఎవరు జీనియస్. ఇందులో అమర్ ఇంకా గౌతమ్ పోటీపడ్డారు. స్క్రీన్ పై కొన్ని బొమ్మలు చూపించి వాటికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగాడు బిగ్ బాస్. అమర్ తెలివితక్కువ సమాధానాలు చెప్పి టీమ్ ఓటమికి కారణమయ్యాడు. ఇలా రెండు టాస్క్ లు కొత్త వాళ్ళే గెలిచారు. ఆటగాళ్ళు చేసేదేం లేక మొహం మాడ్చుకున్నారు.
ఇక ఈ రోజు ఎపిసోడ్లో ఒక కొత్త టాస్క్ ఇచ్చాడు. ఎవరు ఫాస్టెస్ట్ అనే ఛాలెంజ్ విసిరాడు.”కలర్ కలర్ విచ్ కలర్ యూ వాంట్” బిగ్ బాస్ అంటూ కంటెస్టెంట్స్ అడుగుతారు. తనకు కావలసిన రంగు ఎవరైతే ఫాస్ట్ గా తెచ్చి రింగ్ లో వేశారో వాళ్ళు గెలుస్తారు. రెండు టీమ్స్ నుండి ఒక్కో కంటెస్టెంట్ పోటీ పడాలి. బిగ్ బాస్ చెప్పిన ప్రకారం రంగు గల వస్తువు గార్డెన్ ఏరియాలోకి తేవాలి.
హౌస్ మేట్స్ బిగ్ బాస్ చెప్పిన విధంగా వస్తువులు తెచ్చి రింగ్ లో వేస్తారు. ఒక పెద్ద స్పూన్ తేవాలని చెప్పగానే అమర్ ,అశ్వినితో పోటీపడి కిచెన్ లో కి వెళ్లి పెద్ద గరిటె తెచ్చాడు. ఇందులో పెద్ద స్పూన్ ఏది అని అడిగాడు. నాదే నంటూ బదులిచ్చాడు అమర్. ఏ స్పూన్ తో స్విమ్మింగ్ పూల్ లోని నీళ్లు ఫాస్ట్ గా తోడొచ్చ ని బిగ్ బాస్ మరో ప్రశ్న అడిగాడు. ఈ స్పూన్ తోనే బిగ్ బిగ్ అని అమర్ చెప్పగానే,ఏది ఒక సారి చేసి చూపించు అంటూ ఇరికించేశాడు బిగ్ బాస్. దెబ్బకి షాక్ అయ్యాడు. చేసేదేం లేక గరిటెతో నీళ్ల్లు తోడటం స్టార్ట్ చేసాడు. నువ్వు పీకేస్తావ్ ,తవ్వేస్తావ్ అని శివాజీ ఎంకరేజ్ చేశారు