Bigg Boss 7 Telugu : లవ్ ట్రాక్స్ విషయంలో రతికాతో గొడవ… నీ కాళ్ళు పట్టుకుంటానన్న శివాజీ!

ఇక నామినేషన్ ప్రక్రియ మొదలైంది. బిగ్ బాస్ ఇల్లు కోర్ట్ గా మారింది . పవర్ అస్త్రాలు సాధించి ఇంటి సభ్యులు గా మారిన సందీప్ ,శివాజీ ,శోభా లను జ్యూరీ సభ్యులుగా నియమించాడు బిగ్ బాస్ .

Written By: NARESH, Updated On : September 25, 2023 6:31 pm
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 నాలుగవ వారానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసింది స్టార్ మా . ప్రోమో ఆసక్తికర విషయాలతో కూడి ఉంది. శివాజీ , రతికల మధ్య ఒక హీటెడ్ వాగ్వాదం నడుస్తుంది . గత వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ప్రశాంత్ ని నీకు రతికకు మధ్య వున్నా లవ్ ట్రాక్ ముందుగా ఎవరు మొదలు పెట్టారు అని ప్రశ్నించగా ప్రశాంత్ నీళ్లు నములుతాడు. నువ్వు చెప్పు శివాజీ అని నాగార్జున అడగ్గా… రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అని బదులిచ్చాడు . రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని అలా సైమల్టేనియస్ గా చెప్పేసావ్ ఏంటి అన్న అంటూ రతికా, శివాజీ ని అడుగుతుంది .

అప్పుడు శివాజీ నేను సరదాగా చెప్పనమ్మా ,వాళ్ళు వీడియో ప్లే చేసి చూపిస్తే ఓకే నా అంటూ రతికను మందలించాడు . రతిక మాత్రం తన వాదన కంటిన్యూ చేస్తుంది. దాంతో సారీ చెప్పాను కదమ్మా  అని శివాజీ అంటే అలా కాదన్నా అంటుంది రతిక . ఇప్పుడేంటి నాకు క్లాస్ పీకుతున్నావా ,నీ కాళ్లు పట్టుకోమంటావా అంటూ ఫైర్ అయ్యాడు శివాజీ .

ఇక నామినేషన్ ప్రక్రియ మొదలైంది. బిగ్ బాస్ ఇల్లు కోర్ట్ గా మారింది . పవర్ అస్త్రాలు సాధించి ఇంటి సభ్యులు గా మారిన సందీప్ ,శివాజీ ,శోభా లను జ్యూరీ సభ్యులుగా నియమించాడు బిగ్ బాస్ . కంటెస్టెంట్స్ తాము నామినెట్ చెయ్యాలి అనుకున్న సభ్యులను బోన్ లో నిలబెట్టి ,స్ట్రాంగ్ రీజన్స్ చెప్పి జడ్జెస్ ను ఒప్పించాలి కండిషన్ పెట్టాడు బిగ్ బాస్ .

ప్రిన్స్ ,ప్రియాంక ని నామినేట్ చేస్తూ నన్ను అన్యాయంగా గేమ్ నుంచి తప్పించారు ,ఇద్దరు అమ్మాయిలు కలిసి ఫెమినిజం తో నన్ను గేమ్ ఆడనివ్వలేదు అని ఆరోపించాడు . శోభా దీనికి ఒప్పుకోలేదు ఇది సరైన రీజన్ కాదు ఆర్గివ్ చేసింది . ప్రిన్స్ తన రెండో నామినేషన్ తేజ ని బోన్ లో నిలబెడతాడు . నువ్వు మూడు వారాలు అయిపోయినా ఫీజికల్ టాస్క్ లు ఆడటంలేదు అని యావర్ తేజా ని నామినేట్ చేస్తాడు ,అప్పుడు తేజ మూడు వారాలు కాదు ముప్పై వారాలైనా ఇలానే ఉంటాను బ్రో ,ఫిజికల్ అంటే మొన్న టాస్క్ చేసేటప్పుడు వాటర్ గో టూ యావర్ అన్నానా లేక మొహం మీద కొట్టేనా ,బీస్ట్ టాస్క్ లో నీ కన్నా ఎక్కుసేపు వున్నాను ,నా పాయింట్స్ మాట్లాడనివ్వు అంటూ కేకలు వేశాడు తేజ.