Bigg Boss 7 Telugu – Damini : మూడు వారాలు హౌస్లో ఉన్న దామినికి షాకింగ్ రెమ్యునరేషన్!

ఇందులో టాక్స్ లు పోను ఆమెకు సుమారు 5 లక్షల దాకా వచ్చే అవకాశం ఉంది. బాహుబలి సినిమా తో టాప్ సింగర్ గా ఎదిగిన దామిని కి ఒక్కో పాటకు సుమారు లక్షకు పైగా వస్తాయని సమాచారం.

Written By: NARESH, Updated On : September 25, 2023 12:30 pm
Follow us on

Bigg Boss 7 Telugu – Damini : తెలుగు బుల్లితెర సూపర్ హిట్ షో బిగ్ బాస్ సీజన్ 7 మంచి రేటింగ్స్ సాధిస్తూ ముందుకు వెళ్తుంది. వారం వారం ఊహించని ఎలిమినేషన్స్ తో షో పై ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. గత ఆదివారం హౌస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యింది. నిజానికి ఆమె మరికొన్ని రోజులు హౌస్ లో ఉంటుందని అనుకున్నారు. గేమ్స్ లో కావచ్చు , కంటెంట్ ఇవ్వటంలో కావచ్చు దామిని పర్ఫామెన్స్ బాగానే ఉంది. కాకపోతే ఇది బిగ్ బాస్ కదా ఎప్పుడు ఏమి జరుగుతుందో ఊహించలేము.

ఎలిమినేట్ ప్రక్రియ లో చివరిగా దామిని , శుభశ్రీ ఇద్దరు మాత్రమే మిగిలారు. ఈ సందర్భంగా ఇద్దరి ఫోటోలను షిప్ ల మీద అతికించి ఎవరి షిప్ పేలిపోతే వాళ్ళు ఎలిమినేట్ అయినట్లు అంటూ నాగార్జున చెప్పారు. దామిని షిప్ పేలిపోవడం తో ఆమె ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లో ఆమె దాదాపు మూడు వారాలు ఉంది. దీనిపై ఆమె మాట్లాడుతూ నేను ఇంకా మరికొన్ని రోజులు ఉంటానేమో అనుకున్నాను. కానీ మూడు వారాలకే వెళ్ళిపోతున్న అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక ఈ మూడు వారాలకు ఆమె అందుకున్న బిగ్ బాస్ రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. మనకి వస్తున్న సమాచారం ప్రకారం ఆమె రోజుకు సుమారు 28 వేలు దాక తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ లెక్కన వారానికి 2 లక్షలు , అంటే మూడు వారాలకు 6 లక్షల రెమ్యూనరేషన్ అందుకుంది. ఇందులో టాక్స్ లు పోను ఆమెకు సుమారు 5 లక్షల దాకా వచ్చే అవకాశం ఉంది. బాహుబలి సినిమా తో టాప్ సింగర్ గా ఎదిగిన దామిని కి ఒక్కో పాటకు సుమారు లక్షకు పైగా వస్తాయని సమాచారం.

పైగా ఈవెంట్స్ అంటూ , షోలు అంటూ దామిని బాగానే సంపాదించే అవకాశం ఉంది. కానీ బిగ్ బాస్ ఎక్స్ పీరియన్సు కావాలనే ఆమె ఈ షో కి వచ్చినట్లు తెలుస్తుంది. కేవలం పాటలతోనే కాకుండా తన అందంతో కూడా ఆకట్టుకునే దామిని బిగ్ బాస్ హౌస్ లో కూడా గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గలేదు . అదే విధంగా గొడవలు పెట్టుకోవడం లో కావచ్చు , గేమ్స్ ఆడే విషయంలో కావచ్చు దూకుడు చూపించింది . ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ 2 . ఓ స్టార్ట్ కాబోతుంది. అందులో మరికొందరు హౌస్ మేట్స్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది