Bigg Boss 7 Telugu: తెలుగు బుల్లితెర సంచలనం బిగ్ బాస్ మరి కొద్ది రోజుల్లో సందడి చేయబోతుంది. ఇప్పటికే వరుసగా ఆరు సీజన్స్ పూర్తిచేసుకున్న ఈ షో ఏడో సీజన్ కోసం సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన టీజర్ కి మంచి అప్లాజ్ కూడా వచ్చింది. తాజాగా ఈ షో సెప్టెంబర్ 3న టెలికాస్ట్ కాబోతుందని బిగ్ బాస్ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
అన్నపూర్ణ సెవెన్ ఎకరాలలో వేసిన సెట్ లో బిగ్ బాస్ జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేసింది బిగ్ బాస్ యూనిట్. ఈ సీజన్ కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నిజానికి గత సీజన్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. షో లో ఇచ్చిన టాస్క్ లు కానీ, గేమ్ షో నడిచిన విధానం కానీ సరిగ్గా లేదు. దీంతో ఆ సీజన్ పై విపరీతమైన ట్రోల్ల్స్ వచ్చాయి.
వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ సీజన్ ను ఎలాగైనా హిట్ చేయాలనీ బిగ్ బాస్ యూనిట్ గట్టి ప్రయత్నాలే చేస్తుంది. అయితే షో హిట్ కావాలంటే ప్రధానంగా అందులో పాల్గొనే కంటెస్టెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకులు ఈ షో కి కనెక్ట్ కావాలంటే కొంచం తెలిసిన జనాలు కావాలి. కానీ బిగ్ బాస్ అంటేనే సెలెబ్రెటీస్ వెనకడుగు వేస్తున్నారు. మొదటి సీజన్ కు మంచి కంటెస్టెంట్స్ వచ్చారు కానీ, ఆ తర్వాత నుంచి సెలెబ్రెటీస్ దొరకడం కష్టమై పోయింది.
ఈ సీజన్ కి కూడా సెలెబ్రెటీస్ కొరత బాగానే ఉంది. దీంతో కొందరు బుల్లితెర నటీనటులు, సోషల్ మీడియా స్టార్స్ ను సెట్ చేస్తుంది బిగ్ బాస్ టీం. సీరియల్ నటుడు అమర్ దీప్, సీరియల్ యాక్ట్రెస్ ఐశ్వర్య, శోభ, సినీ నటుడు మహేశ్ అచంట, సుభాశ్రీ, అన్షు, ఆట సందీప్, శేతల్, షావలి, మోడల్ యవర్, అంజలి, యూట్యూబర్ అనిల్ జీలా పేర్లు లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీళ్ళు కాకుండా ఇంకా కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళ కోసం బిగ్ బాస్ టీం ఆఖరి నిమిషం వరకు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. చూద్దాం ఈ సీజన్ కి హౌస్ లో సందడి చేసే సెలబ్రిటీస్ ఎవరు అనేది…