Bigg Boss 7 Contestants List Leaked: బిగ్ బాస్ సీజన్ 7కి రంగం సిద్ధమైంది. ఆల్రెడీ యూనిట్ ప్రోమో విడుదల చేశారు. బిగ్ బాస్ తెలుగు 7 లోగో అదిరింది. త్వరలో హోస్ట్ ఎవరో రివీల్ చేయబోతున్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఎప్పటిలాగే 19 నుండి 20 మంది సెలబ్రిటీలు లేటెస్ట్ సీజన్లో కాంటెస్ట్ చేయనున్నారని సమాచారం. జులై చివరి వారం లేదు ఆగస్టు మొదటి వారంలో బిగ్ బాస్ గ్రాండ్ గా లాంచ్ కానుంది. బిగ్ బాస్ లవర్స్ ఎంతగానో ఈ షో కోసం ఎదురు చూస్తున్నారు.
కాగా గత సీజన్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో దారుణమైన టీఆర్పీ సీజన్ 6 అందుకుంది. కనీసం ఒక ప్లాప్ సీరియల్ కంటే తక్కువ ఆదరణ దక్కింది. వీకెండ్స్ కూడా సేమ్ సీన్. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఫస్ట్ నాగార్జున హోస్టింగ్ విమర్శల పాలైంది. ఆయన కంటెస్టెంట్స్ ని జడ్జి చేసిన తీరు, వీకెండ్ రివ్యూలు పక్షపాతంగా సాగాయనే మాట వినిపించింది. ఎలిమినేషన్స్ పై సోషల్ మీడియాలో వ్యతిరేకత నడిచింది.
అదే ఓల్డ్ గేమ్స్, కంటెస్టెంట్స్ లో పస లేకపోవడంతో వలన బిగ్ బాస్ సీజన్ 6 విఫలం చెందిందని పలువురు అభిప్రాయపడ్డారు. గత సీజన్లో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా పకడ్బందీగా షో ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో క్రేజీ కంటెస్టెంట్స్ ని ఎంపిక చేశారట. అనూహ్యంగా బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ లిస్ట్ లీకైంది. సదరు లిస్ట్ ప్రకారం బోల్డ్ యాంకర్ విష్ణుప్రియ ఎంపికయ్యారట. ప్రేమించి పెళ్లి చేసుకున్న సీరియల్ నటులు అమర్ దీప్, తేజస్విని కపుల్స్ విభాగంలో ఎంట్రీ ఇవ్వనున్నారట.
అనూహ్యంగా విడాకులు తీసుకున్న నోయల్, ఎస్తేరు సీజన్ 7 కంటెస్టెంట్స్ లో లిస్ట్ లో ఉన్నారంటున్నారు. అలాగే జబర్దస్త్ మాజీ కమెడియన్ అప్పారావు హౌస్లో అడుగుపెట్టబోతున్నారట. కార్తీక దీపం సీరియల్ విలన్ శోభా శెట్టి మరొక క్రేజీ కంటెస్టెంట్ అంటున్నారు. సింగర్ మోహన భోగరాజు, ఢీ పండు, యూట్యూబర్ నిఖిల్, మహేష్ బాబు కాళిదాసు, సాయి రోనాక్, సిద్ధార్థ్ వర్మ బిగ్ బాస్ సీజన్ 7 లిస్ట్ లో ఉన్న కొందరు కంటెస్టెంట్స్ అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది.