Mahesh Babu Cheating Case: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న బ్రాండ్ ఇమేజి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన పేరు ని ఉపయోగించుకొని కోట్ల రూపాయిల బిజినెస్ ని చేసుకునే వాళ్ళు లక్షల్లో ఉంటారు. ముఖ్యంగా బ్రాండెడ్ కంపెనీలు మహేష్ బాబు క్రేజ్ ని ఏ రేంజ్ లో వాడుకుంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు , ఇండియా లోనే అత్యధిక యాడ్స్ చేసే హీరో గా సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచాడు. ఒక్కో సినిమాకి 70 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకునే మహేష్ బాబు, ఈ కమర్షియల్ యాడ్స్ ద్వారా ఏడాది మరో 200 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటాడు. అలాంటి సూపర్ స్టార్ ప్రచారకర్త గా వ్యవహరించే బ్రాండ్స్ ఏ చిన్న తప్పిదం చేసినా కూడా ఆయన ఇమేజి కి భంగం కలిగినట్టే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇప్పుడు మహేష్ బాబు కి అలాంటి తలవంపు ఒక్కటి వచ్చి పడింది. అదేమిటంటే మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బ్రాండెడ్ కంపెనీస్ లో ఒకటి శ్రీ సాయి సూర్య గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ. ఈ సంస్థపై ఇప్పుడు చీటింగ్ కేసు నమోదు అయ్యింది. విష్ణు వర్ధన్ అనే వినియోగదారుడు తన స్నేహితులతో కలిసి ఈ కంపెనీ వ్యవసాయత్ర భూమి పై 3 కోట్ల 21 లక్షల రూపాయిల పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడి పెట్టిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పిన ఆ సంస్థ ఎన్నాళ్ళు అయినా రిజిస్ట్రేషన్ చెయ్యకపోయేసరికి , మోసం జరుగుతుందేమో అనే అనుమానం తో విష్ణు వర్షన్ విచారణ చెయ్యడం మొదలు పెట్టాడు. ఆ విచారణలో తేలింది ఏమిటంటే చాలా క్రితమే అదే భూమి మీద ఎస్వీఆర్ వెంకటేష్ కంపెనీస్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారట.
దీనితో ఆగ్రహించిన విష్ణు వర్ధన్ , శ్రీ సాయి సూర్య కంపెనీ ఓనర్ పై చీటింగ్ కేస్ నమోదు చేసారు. అలాగే సూపర్ స్టార్ హోదా లో ఉన్న ఒక హీరో కమర్షియల్ యాడ్ చేసేటప్పుడు అందులో లొసుగులు తెలుసుకొని చెయ్యాలి కానీ , ముందు వెనుక చూసుకోకుండా ఇలాంటి మోసపూరిత కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ అవుతారా అంటూ మహేష్ బాబుపై ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.