Ticket 2 Finale Task- Srihan: బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన టికెట్ 2 ఫినాలే టాస్కు ఈ వారం మొత్తం ఎంతో రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే..వివిధ లెవెల్స్ లో ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ టాస్కు హైయెస్ట్ పాయింట్స్ తో కొనసాగిన ‘ఆదిరెడ్డి’ నిన్న టాస్కు నుండి తొలగిపోయాడు..శ్రీహాన్ మరియు ఆదిరెడ్డి మధ్య టై అవ్వడం తో బిగ్ బాస్ ‘టై’ బ్రేకర్ టాస్కు ని నిర్వహిస్తాడు.

ఈ టాస్కులో రేవంత్ , ఆది రెడ్డి మరియు శ్రీహాన్ పాల్గొంటారు..అప్పటి వరుకు లెవెల్స్ అన్నిట్లో విజృభించి ఆడిన ఆదిరెడ్డి ఈ లెవెల్ లో మాత్రం బాగా వెనుకబడుతాడు..పెరిగిస్తూ బుడగలు ఊదే రౌండ్ లో ఎందుకో ఆయన బుడగలు ఊది వేగంగా పగలగొట్టడం లో విఫలం అవుతాడు..శ్రీహాన్ మరియు రేవంత్ స్విమ్మింగ్ పూల్ లో దూకి తమ కలర్స్ బాల్స్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకున్నా కూడా ఆది రెడ్డి ఇంకా బుడగలు ఊదే రౌండ్ దగ్గరే నిలిచిపోతాడు.
దీనితో ఆదిరెడ్డి కి కేవలం ఆ రౌండ్ లో రెండు పాయింట్లు మాత్రమే లభిస్తాయి..రేవంత్ అందరికంటే ముందుగా టాస్కు ని ఫినిష్ చేసాడు కాబట్టి 6 పాయింట్లు..ఆ తర్వాత శ్రీహాన్ వచ్చాడు కాబట్టి అతనికి నాలుగు పాయింట్లు దక్కాయి..ఇక టై బ్రేకర్ కి కూడా అదే టాస్కు పెట్టడం తో ఆది రెడ్డి మళ్ళీ ఓడిపోతాడు..ఫలితంగా ఆయన టికెట్ 2 ఫినాలే టాస్కు నుండి వైదొలగిపోతాడు..చివరికి శ్రీహాన్ మరియు రేవంత్ టికెట్ 2 ఫినాలే ఫైనల్ లెవెల్ లో పోటీ పడుతారు..వీళ్లిద్దరి మధ్య హోరాహోరీ పోరు నడిచినట్టు తెలుస్తుంది ..ఈ పోరులో రేవంత్ పై శ్రీహాన్ పై చెయ్యి సాధించి టికెట్ 2 ఫినాలే టాస్కు గెలుపొంది ఫైనల్స్ కి వెళ్లినట్టు తెలుస్తుంది.

వాస్తవానికి ఈ టాస్కులో రేవంత్ మరియు శ్రీహాన్ వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా గెలవకపోయిన ఫైనల్స్ కి వెళ్లడం మాత్రం పక్కా..కానీ ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న ఆది రెడ్డి మరియు ఫైమా లలో ఎవరో ఒకరు ఈ టాస్కు గెలిచి ఉంటె ఎలిమినేషన్స్ ని తప్పించుకొని ఫైనల్స్ కి వెళ్లే అవకాశం ఉండేదని నెటిజెన్స్ ఫీల్ అవుతున్నారు.