Inaya Sultana – RJ Surya: బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకు కేవలం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. హౌస్లో రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహాన్, శ్రీసత్య, కీర్తి ఉన్నారు. వీరిలో ఫైనల్ కి వెళ్ళేది ఐదుగురు మాత్రమే. బుధవారం వరకు పోలైన ఓట్ల ఆధారంగా తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ఒకరిని ఎలిమినేట్ చేయనున్నట్లు నాగార్జున వెల్లడించారు. ఈ విషయం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కి కూడా తెలియదు. ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు. జస్ట్ ఫైనల్ కి ముందు హౌస్ వీడే ఆ అన్ లక్కీ కంటెస్టెంట్ ఎవరో చూడాలి.

కాగా 14వ వారం ఇనయా ఎలిమినేటైన సంగతి తెలిసిందే. ఆదిరెడ్డి-ఇనయా డేంజర్ జోన్లోకి వచ్చారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఇనయా ఎలిమినేటైనట్లు నాగార్జున వెల్లడించారు. హౌస్లో లేడీ టైగర్ గా పేరు తెచ్చుకున్న ఇనయా ఎలిమినేషన్ విమర్శల పాలైంది. శ్రీసత్య కంటే కూడా ఇనయాకు తక్కువ ఓట్లు వస్తాయంటే మేము నమ్మం. ఇనయాది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉంటే ఇనయా హౌస్లో సూర్యకు దగ్గరైన విషయం తెలిసిందే. కన్ఫెషన్ రూమ్ లో సూర్యపై నాకు క్రష్ ఉందని నేరుగా చెప్పింది. ఒక రెండు వారాలు సూర్య-ఇనయా ఓ రేంజ్ లో రొమాన్స్ కురిపించారు. ఇనయాతో ఒక ప్రక్క రిలేషన్ ఎంజాయ్ చేస్తూనే సూర్య టాస్క్, గేమ్స్ నిర్లక్ష్యం చేయలేదు. ఇనయా మాత్రం సూర్య పిచ్చిలోనే బ్రతికేసింది. ఈ క్రమంలో నాగార్జున ఆమెకు క్లాస్ పీకాడు. నాగార్జున వార్నింగ్ తర్వాత సూర్య, ఇనయా ఒక రహస్య ఒప్పందం చేసుకున్నారు.

దూరంగా ఉంటున్నట్లు నటిద్దాం అని చెప్పుకున్నారు. దీనిలో భాగంగా సూర్యను ఇనయా నామినేట్ చేసింది కూడా. అదే వారం సూర్య ఎలిమినేట్ కావడంతో ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. హౌస్లో ఉన్నన్నాళ్లు ఇనయా సూర్య జ్ఞాపకాలతో బ్రతికేసింది. ఇక ఎలిమినేటైన ఇనయా వెంటనే సూర్యను కలిసింది. ఇద్దరూ రొమాంటిక్ గా దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇన్నాళ్లు సూర్యకు దూరంగా ఉన్న ఇనయా అతన్ని కలిసేవరకు ఆగలేకపోయింది. ఇక ఈ బిగ్ బాస్ ప్రేమికుల ప్రయాణం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. అయితే ఇనయా, బుజ్జమ్మ నాకు మిత్రులు మాత్రమే.. పెద్దవాళ్ళు చూసిన అమ్మాయిని నేను వివాహం చేసుకుంటానని సూర్య చెప్పడం కొసమెరుపు.