Inaya Sultana- Srihan And Sri Satya: బిగ్ బాస్ తెలుగు లేటెస్ట్ సీజన్ ఇప్పుడు కాస్త వాడవేడిగా సాగుంటున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ వారం ఇచ్చిన బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్కు లో ఇంటి సభ్యులందరు అద్భుతంగా ఆడదానికి ప్రయత్నం చేసారు..ఈ క్రమం లో ఇంటి సభ్యులు ఫిజికల్ అవ్వడం తో కొంతమందికి దెబ్బలు కూడా తగిలాయి..అంతే కాకుండా ఉద్వేగంగా లో ఇంటి సభ్యులు కొంతమంది నోరు అదుపులో లేకుండా హద్దులు కూడా దాటేస్తున్నారు..ఇక అసలు విషయానికి వస్తే పోయినవారం బిగ్ బాస్ హౌస్ నుండి సూర్య ఎలిమినేట్ అవ్వడం బిగ్ బాస్ హౌస్ లో పెను దుమారమే రేపింది.

ఇనాయ వేసిన ట్రాప్ లో చిక్కుకోవడం వల్లే సూర్య ఎలిమినేట్ అయ్యాడని..స్నేహం పేరుతో అతనిని నమ్మించి మోసం చేసి అతను ఆట ఎఫెక్ట్ అయ్యేలా చేసిందని..చివరికి అతనిని కావాలనే సిల్లీ రీసన్ తో నామినేట్ చేసి బయటకి పంపేసిందని..ఇంటి సభ్యులలో చాలా మంది ఆమెని ఈ పాయింట్ మీదనే ఈ వారం నామినేట్ చేసారు.
ఇక శ్రీహాన్ – శ్రీ సత్య అయితే నిన్న ఇనాయ తో గొడవపడినప్పుడల్లా ‘స్నేహితుడిని వెన్నుపోటు పొడిచి పంపేసావ్’ అనే పాయింట్ మీదనే ఆమెని ట్రిగ్గర్ చెయ్యడానికి చూసారు..దీనికి ఇనాయ చాలా హర్ట్ అయ్యింది..నిన్న బాత్ రూమ్ లో ఏడుస్తూ కూర్చున్న తర్వాత బిగ్ బాస్ ఆమెని కన్ఫెషన్ రూమ్ కి రమ్మని పిలిచి ఆమెలో ధైర్యం నింపాడు..ఇక ఆ తర్వాత ఇనాయ మళ్ళీ రెచ్చిపోయి టాస్కులో ఆడదానికి ప్రయత్నం చేసింది..శ్రీహన్ – శ్రీ సత్య ఇదే విషయాన్ని గుచ్చి గుచ్చి ఆమెని రెచ్చగొట్టాలని చూసిన ఆమె రెచ్చిపోకుండా రివర్స్ స్ట్రాటజీ తో శ్రీహాన్ – శ్రీ సత్య ని ఆడియన్స్ దృష్టిలో చెడు అబిప్రాయం కలిగేలా కామెంట్స్ చేసింది..దానికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

ముందుగా శ్రీహాన్ ఇనాయ మీదకి వస్తూ ఇందాక ఎదో నోరు జారావ్ ఏంటి అది అని అడుగుతాడు..అప్పుడు ఇనాయ సమాధానం చెప్తూ ‘నేనేమి నోరు జారలేదు..చూసిందే చెప్పాను..ఇందాక మీ ఇద్దరు క్రింద పడుకొని ఉన్నారు’ అని అంటుంది..దీనికి ‘శ్రీహాన్ ఆడియన్స్ చూడండి ఈ డ్రామా క్వీన్ ని..మా రిలేషన్ మీద మాకు నమ్మకం ఉంది..నీలాగా అనుకున్నావా’ అని అంటాడు..తర్వాత ఏమి జరిగింది అనేది తెలియాలంటే రాత్రి పది గంటల వరుకు ఆగాల్సిందే.