Bigg Boss 6 Telugu- Geetu vs Inaya Sultana: బిగ్ బాస్ సీజన్ 6 ఇటీవల కాలం లో చాలా ఆసక్తికరంగా సాగుతూ ముందుకు దూసుకుపోతుంది..మునుపెన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా గేమ్ టాస్కులు డిజైన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం..ఈ వారం కెప్టెన్సీ టాస్కు అద్భుతంగా కొనసాగింది..హౌస్ మేట్స్ అందరూ కూడా నిద్రలు కూడా మానేసి స్ట్రాటజీలు వేస్తూ తమ గేమ్ ప్లాన్స్ ని అమలు చేస్తున్నారు..ఇక ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో మాస్టర్ మైండ్ స్ట్రాటజీలు వేసి గేమ్ ని రక్తి కట్టించింది గీతూ.

అందరూ నిద్రపోతున్న సమయం లో లగేజి రూమ్ లో పెట్టి ఉన్న ఆది రెడ్డి టీ షర్ట్ ని దొంగలించి..ఆ షర్ట్ మీదున్న బ్లూ స్ట్రిప్స్ ని తొలగించేసింది..పక్క రోజు ఆది రెడ్డి తన షర్ట్ ని చూసి నా లైఫ్ స్ట్రిప్స్ ని ఎవరో దొంగలించేసారు అంటూ తలలు బాదుకుంటాడు..’ఆ స్ట్రిప్స్ ని గీతూ తీసి ఉంటె ఇక నుండి ఆది రెడ్డి vs గీతూ గేమ్ ప్రారంభం అవ్వుధి’ అని చెప్పుకొస్తాడు.
‘మిషన్ పాజిబుల్’ టాస్కులో భాగంగా బజర్ మోగినప్పుడల్లా ఫ్లైట్ నుండి గ్రానైట్లు పడుతుంది..అది ఇరువురి స్క్వాడ్స్ లో ఎవరో ఒకరు పట్టుకొని ఆ స్క్వాడ్ కోసం దాచిపెట్టుకోవాలి..మొదటిసారి గ్రానైట్ ని వేసినప్పుడు ‘రెడ్ స్క్వాడ్’ టీం వారు గ్రానైట్ ని పట్టుకొని దాచిపెట్టుకోగా..రెండవసారి గ్రానైట్ వేసినప్పుడు బ్లూ టీం వారు పట్టుకుంటారు..అయితే బ్లూ టీం వారు అజాగ్రత్తగా గ్రానైట్ సేఫ్ ప్లేస్ లో దాచకుండా ఉండడం గమనించిన శ్రీహాన్ వారి గ్రానైట్ ని కూడా దొంగలించి రెండు గ్రానైట్లను కలిపి బాత్రూం బయట షెల్ఫ్ లో దాచిపెడుతాడు..ఉదయం 7 గంటల సమయం లో ఇనాయ వాటిని దొంగలించి జైలు రూమ్ లో ఉన్న బాత్ రూమ్ లో దాచిపెడుతుంది..ఉదయం లేచి చూసేసరికి ఆ రెండు గ్రానైట్లు మిస్ అయ్యాయని గమనించిన ఫైమా శ్రీహాన్ కి చెప్తుంది.

గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడ దాచిపెట్టారో వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు రెడ్ స్క్వాడ్ కి సంబంధించిన టీం మెంబెర్స్..ఎక్కడా కూడా దొరకకపోవడం తో గీతూ నేరుగా ఇనాయ దాచిపెట్టిన జైలు రూమ్ బాత్ రూమ్ లోకి వెళ్లి ఆ రెండు గ్రానైట్లను తీసుకొస్తుంది..ఇది చూసిన అవతలి టీం సభ్యులు షాక్ కి గురైయ్యారు..అసలు ఈమె ఎలా కనిపెట్టింది అంటూ ఇంటి సభ్యులతో పాటుగా చూసే ప్రేక్షకులు కూడా గీతుని చూసి ఆశ్చర్యపోయారు.