Bigg Boss 6 Telugu Episode 27: బిగ్ బాస్ గురువారం ఎపిసోడ్ ఫుల్ ఆఫ్ ఎమోషన్ పంచింది. ముఖ్యంగా సింగర్ రేవంత్ తో బిగ్ బాస్ గుక్కపట్టి ఏడిపించాడు. అతడి ఎమోషన్స్ ను పీక్ స్టేజ్ కు తీసుకెళ్లాడు. ఏడిపించడం అంటే ఇబ్బంది పెట్టి కాదు.. అతడికి సంతోషాన్ని పంచిపెట్టి ఇలా చేశాడు.
సింగర్ రేవంత్ భార్య సీమంతం తాజాగా జరిగింది. 7 నెలల గర్భవతి అయిన ఆమె సీమంతాన్ని కుటుంబ సభ్యులు వైభవంగా నిర్వహించారు. ఆ వీడియోను సింగర్ రేవంత్ కు హౌస్ లో ప్రత్యేకంగా గార్డెన్ ఏరియాలో చూపించారు. భార్య సీమంతం చూడగానే రేవంత్ కళ్ల వెంట నీళ్లు జలజలా జారాయి. అతడు కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. చాలా సేపు ఏడ్చేశాడు.
అనంతరం పూలు, పండ్లు, ఫలహారాలు, స్వీట్లు తెప్పించి భార్యకు పెట్టినట్టు పెట్టాలని.. వాటిని మీ భార్యకు పంపిస్తామని బిగ్ బాస్ సూచించారు. దీంతో రేవంత్ ఇంటి సభ్యుల మధ్య భార్య ఫొటోకు పసుపు, కుంకుమ రాసి ఆమె ఫలహారాలు పెట్టాడు. తన భార్య సీమంతంను హౌస్ లో నిర్వహించిన బిగ్ బాస్ కు రేవంత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. కన్నీళ్లతో అతడు ఎమోషన్ అయిన తీరుకు ఇంటి సభ్యులంతా కూడా కలిసి ఏడ్చిన పరిస్థితి నెలకొంది.
ఇక కెప్టెన్సీ రేసును బిగ్ బాస్ ఆసక్తికరంగా మార్చాడు. ఉన్న ఇంటి సభ్యులకు ఒక బాక్సింగ్ గ్లౌజ్ ఇచ్చి నచ్చని వారిని కెప్టెన్సీ నుంచి తొలగించాలని ఒక టాస్క్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే చంటి,,, గీతను రేసులోంచి తొలగించగా వీరిద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఇక ఫైమాను ఇలాగే బాలాదిత్య కెప్టెన్సీ నుంచి తొలగించాడు. రాజ్, అర్జున్ లను ఇలానే కెప్టెన్సీ నుంచి ఇంటి సభ్యులు ఎలిమినేట్ చేశాడు.
ఒక ఒక 100 రూపాయలు హోటల్ టాస్క్ లో ఇవ్వలేదని.. హౌస్ లోనే బలమైన కంటెస్టెంట్ గలాటా గీతూ ఏడ్చేసింది. బాలాదిత్యను దీనిపై నిలదీసింది. ఇది న్యాయమా? అని వాపోయింది. ఇక చలాకీ చంటితోనూ తగువు పెట్టుకుంది.
కెప్టెన్సీ టాస్క్ లో ఇంటి సభ్యులంతా తమకు నచ్చినవారిని గెలిపించాల్సింది పోయి.. తాము అంటే పడని వారు.. తమతో గొడవ పడ్డ వారిని ఎలాగైనా దెబ్బకొట్టాలని ఎలిమినేట్ చేశారు. గత సీజన్ల కంటే ఈ సీజన్లలో డిఫెరెంట్ గా ఇంటిసభ్యుల ప్రవర్తన ఆటతీరు కొనసాగుతోంది. చప్పగా.. ముచ్చట్లతోనే అంతా కాలం గడుపుతుండడంతో పెద్దగా మజా రావడం లేదు. ఈ గురువారం ఒక్క రేవంత్ భార్య సీమంత ఒక్కటే హైలెట్ సీన్ అని చెప్పాలి.