Bigg Boss 6- Chalaki Chanti: చలాకీ చంటి ఎలిమినేషన్ నిజంగా షాక్. ఓట్లతో సంబంధం లేకుండా చంటిని ఎలిమినేట్ చేశారన్న వాదన ఉంది. ఎందుకంటే బుల్లితెర స్టార్ గా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. హౌస్లోకి ప్రవేశించిన 21 మందిలో చంటి టెలివిజన్ ప్రేక్షకులు బాగా తెలిసిన ముఖం. ఆటోమేటిక్ గా చంటికి ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. ఎలిమినేషన్ లో ఉంటే వాళ్ళు ఓట్లు ఖచ్చితంగా వేస్తారు. అయినా చంటి ఎలిమినేషన్ కావడానికి నిర్వాహకులకు ఆయన గేమ్ నచ్చకపోవడమే. హౌస్లో కంటెస్టెంట్ ఇలా ఉండాలనే ఒక క్రైటీరియా నిర్వాహకులు సెట్ చేసుకుంటారు.

వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా గేమ్ ఆడేవారికే అక్కడ చోటు ఉంటుంది. ముఖ్యంగా స్పైసీ, కాంట్రవర్సీ కంటెంట్ ఇవ్వాలి. ఒకవైపు టీఆర్పీ రావడం లేదన్న బాధ మేనేజర్స్ ని ఒత్తిడికి గురి చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 6 పరిస్థితి బాగాలేదని నాగార్జున పరోక్షంగా ఒప్పుకున్నారు. అయితే దానర్థం షో ఫెయిల్ అయినట్లు కాదు, టెలివిజన్ ప్రేక్షకులు ఓటీటీకి మారారని సమర్థించుకున్నారు. గతంలో కొన్ని సీజన్స్ కి కూడా ఓటీటీ ఉంది. మరి అప్పుడు రేటింగ్ బాగానే ఉంది కదా అని అడిగితే, నాగార్జున వద్ద సమాధానం ఉండేది కాదు.
కాబట్టి ఓట్ల లెక్కలు ఎలా ఉన్నా ఎంటర్టైన్ చేసేవారికే ఇంట్లో స్థానం ఉంటుంది. అది చేయలేని వాళ్ళను నిర్దాక్షిణ్యంగా ఎలిమినేట్ చేస్తారు. చలాకీ చంటి తన ఎలిమినేషన్ ని సీరియస్ గా తీసుకోలేదు. కారణం బయట అతనికి కెరీర్ ఉంది. బుల్లితెర, వెండితెర ఆఫర్స్ ఎదురు చూస్తున్నాయి. అందుకే హ్యాపీగా బయటికి వెళ్లిపోయారు. ఆయనకు హౌస్ వాతావరణం, గేమ్స్, రూల్స్ నచ్చలేదు. చంటి పెద్దగా షో పట్ల ఆసక్తి చూపలేదనేది నిజం.

ఇదిలా ఉంటే ఐదు వారాలు హౌస్లో ఉన్న చంటి ఎంత సంపాదించారు? ఆయన రెమ్యూనరేషన్ ఎంత? అనే విషయాలు తెరపైకి వచ్చాయి. ఈ విషయంలో వివిధ మీడియా సంస్థలు వివిధ సమాచారం ఇస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం చంటి వారానికి రూ. 1 నుండి 1.5 లక్షల రెమ్యూనరేషన్ ఒప్పందంపై హౌస్లో అడుగుపెట్టాడట. ఆ లెక్కన చంటి ఐదు వారాలకు రూ. 5 నుండి 7.5 లక్షలు అందుకున్నారట. బిగ్ బాస్ వలన ఆయనకు కొత్తగా వచ్చిన గుర్తింపు ఏదీ లేదు కాబట్టి చంటి బిగ్ బాస్ షోకి రావడం నష్టమే.