Adi Reddy- Revanth: బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్కు మొత్తం గొడవలు మధ్య జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే..’మిషన్ పాజిబుల్’ టాస్కులో భాగంగా ఇంటి సభ్యులు రెండు ‘రెడ్ స్క్వాడ్’ మరియు ‘బ్లూ స్క్వాడ్’ గా విడిపోయారు..’రెడ్ స్క్వాడ్’ లో గీతూ , శ్రీహన్ , రేవంత్ ,శ్రీ సత్య , ఫైమా మరియు కీర్తి ఉండగా వీళ్ళకి లీడర్ గా గీతూ ఉన్నది..అలాగే ‘బ్లూ స్క్వాడ్’ కి లీడర్ గా ఆది రెడ్డి ఉండగా మిగిలిన ఇంటి సభ్యులందరూ ఆ స్క్వాడ్ లో టీం మెంబెర్స్ గా ఉన్నారు.

అలా రెండు జట్లు టాస్కులో నిమగ్నమై ఆడుతుండగా మధ్యలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి..టాస్కులో భాగంగా ఒక టీం స్క్వాడ్ మెంబెర్స్..అవతల స్క్వాడ్ మెంబెర్స్ టీ షర్ట్ మీద ఉన్న నాలుగు లైఫ్ స్ట్రిప్స్(రెడ్/బ్లూ) ని తొలగించి చంపాలి..అలా రెండు స్క్వాడ్స్ లో ఏ స్క్వాడ్ లో ఎక్కువ మంది బ్రతికి ఉంటారో..ఆ స్క్వాడ్ మెంబెర్స్ మొత్తం కెప్టెన్సీ పోటీదారులు అవుతారు.
ఈ టాస్కులో అందరూ చాలా బాగా ఆడారు..ఈ ఆటలో తోపులాట కూడా బాగా జరిగింది..ఆది రెడ్డి రేవంత్ టీ షర్ట్ మీద లైఫ్ స్ట్రిప్స్ ని తొలగించే క్రమం లో రేవంత్ కి ఆది రెడ్డి గోరు మెడకి తగిలి బాగా గాయం అవుతుంది..బాగా నొప్పి కలిగేలోపు కోపం తో ఆది రెడ్డి ని రేవంత్ ‘నా కొడకా’ అని తిడుతాడు..అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాసేపు గొడవ జరిగింది..ఈ గొడవలో కాసేపు ఇద్దరు కూడా ఫిజికల్ అయ్యారు..దీనిపై ఈ వారం రేవంత్ కి నాగార్జున గారి దగ్గర నుండి తిట్లు తప్పేలా లేవు.

ఇక బాలాదిత్య సంగతి మన అందరికి తెలిసిందే..మన బలహీనతల మీద అవతల టీం ఎక్కువగా కొడుతోంది..కాబట్టి ఎవ్వరు కూడా బలహీనతలు లోను అవ్వొద్దు అంటూ ఆయనే చివరికి బలహీనతకు లోనై సిగరెట్ కోసం గీతూ తో పెద్ద గొడవ పడ్డాడు..అలా కెప్టెన్సీ టాస్కు వాడివేడిగా సాగింది నిన్న మొత్తం..ఇక దీని కొనసాగింపుగా ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి మరి.