Nagarjuna- Aadi Reddy: బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమై ఇప్పటికి 12 వారాలు పూర్తి చేసుకొని 13 వారం లోకి అడుగుపెట్టింది..ఇక ప్రేక్షకులు ఆసక్తి గా ఎదురు చూసే నామినేషన్స్ ప్రక్రియ ఎపిసోడ్ రోజు రానే వచ్చింది..గత వారం నామినేషన్స్ కన్ఫెషన్ రూమ్ లో జరిగేసరికి పెద్దగా గొడవలేమి జరగలేదు..సాఫీగా సాగిపోయింది..కానీ ఈ వారం నామినేషన్స్ మాత్రం వాడివేడిగా సాగింది..దానికి సంబంధించిన ప్రోమో విడుదల చెయ్యగా అది వైరల్ గా మారింది.

ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి నామినెటే అయినా ఇంటి సభ్యులు రోహిత్, ఫైమా, రేవంత్ , ఆది రెడ్డి , కీర్తి మరియు శ్రీ సత్య..అనూహ్యం గా ప్రతి వారం నామినేషన్స్ లో ఉండే శ్రీహాన్ ఈ వారంలో మాత్రం నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు..కానీ రేవంత్ మాత్రం ఎప్పటిలాగానే ఈ వారం కూడా నామినేషన్స్ లోకి వచ్చాడు..ఇనాయ కెప్టెన్ అయినా కారణంగా ఆమె కూడా నామినేషన్స్ లోకి రాలేదు.
ఇక ఈరోజు నామినేషన్స్ కి సంబంధించిన ప్రోమో లో ముందుగా ఫైమా రోహిత్ ని నామినేట్ చేస్తూ ‘ఈ హౌస్ లో రేవంత్ అన్న తర్వాత అందరికంటే ఎక్కువ స్ట్రాంగ్ ఉన్న మీరే కాబట్టి మిమల్ని నామినేట్ చేస్తున్నాను’ అని చెప్పుకొస్తుంది..అప్పుడు రోహిత్ బాధతో మాట్లాడుతూ ‘స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నామినేట్ చేసావు..కానీ ఈ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇప్పటి వరుకు ఇంటికి కెప్టెన్ అవ్వలేదు’ అంటాడు.

ఇక ఆది రెడ్డి రేవంత్ ని నామినేట్ చేస్తూ ‘నాగార్జున గారు చూపించిన వీడియో ని నేను ఏకీభవించను..ఎందుకంటే అక్కడ ఏదైతే వీడియో చూపించారో..దాని ముందు జరిగిన వీడియో మాత్రం చూపించలేదు..నేను ఇప్పుడు ఎప్పుడు ఇంకో పది సంవత్సరాల తర్వాతైనా దీని మీద ఇదే స్టాండ్ తీసుకుంటాను’..అప్పుడు రేవంత్ సమాధానం ఇస్తూ ‘మీరు దాని మీద స్టాండ్ అయ్యారు..నేను మాత్రం నాగార్జున గారి వీడియో మీద స్టాండ్ అయ్యాను’ అలా వీళ్లిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది..ఇక ఆ తర్వాత శ్రీహాన్ కూడా ఆది రెడ్డి ని నామినేట్ చేస్తాడు..అలా ఈరోజు బిగ్ బాస్ హౌస్ నామినేషన్స్ పర్వం వాడవేడిగా సాగింది.
https://www.youtube.com/watch?v=57FbyP6tJm4