Bigg Boss 6 Telugu 12th Week Voting Results: బిగ్ బాస్ హౌస్లో సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. రేవంత్ కెప్టెన్ కావడంతో అతన్ని నామినేట్ చేయడానికి వీలు లేదని బిగ్ బాస్ ఆదేశించారు. ఈసారి నామినేషన్స్ ప్రక్రియ రహస్యంగా నిర్వహించాడు. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ కి వచ్చి ఇద్దరు ఇంటి సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నామినేషన్స్ లో శ్రీహాన్ అత్యధికంగా నాలుగు వ్యతిరేక ఓట్లు దక్కించుకున్నాడు. ఇక కీర్తి ఒక్కటే నామినేషన్స్ లోకి రాలేదు. దీంతో రేవంత్, కీర్తి మినహాయించి ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీసత్య, రోహిత్, ఫైమా, ఇనయా, రాజ్ నామినేట్ కావడం జరిగింది.

నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఆడియన్స్ ఓట్లు వేస్తున్నారు. రేవంత్ ఎలిమినేషన్స్ లో ఉన్న ప్రతిసారీ ఓటింగ్ పరంగా అతడే టాప్ లో ఉంటున్నాడనే సమాచారం అందుతుంది. లేడీ కంటెస్టెంట్ ఇనయా నుండి రేవంత్ కి గట్టి పోటీ ఎదురవుతుంది. ఈ వారం రేవంత్ నామినేషన్స్ లో లేని క్రమంలో ఇనయా ఓటింగ్ లో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారట. తర్వాత ఆదిరెడ్డి, మూడో స్థానంలో రోహిత్, నాలుగో స్థానంలో శ్రీహాన్, ఐదవ స్థానంలో రాజ్ కొనసాగుతున్నారట.
ఇక ఫైమా ఆరవ స్థానంలో, శ్రీసత్య ఏడవ స్థానంలో కొనసాగుతున్నారట. మరీ ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ వారం శ్రీసత్య హౌస్ నుండి వెళ్ళిపోతారని అంటున్నారు. ఒకవేళ ఫైమా వెనుకబడితే ఆమెపై వేటు పడుతుంది. అయితే ఫైమా గేమ్ పరంగా, ఆట తీరుపరంగా స్ట్రాంగ్ అని నిరూపించుకుంది. మరోవైపు శ్రీసత్యపై ఫుల్ నెగిటివిటీ నడుస్తుంది. ఆమెను ఎలిమినేట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. ఈ వారం శ్రీసత్య ఎలిమినేషన్ ఖాయమన్న మాట వినిపిస్తోంది

ఇక ఈ వారం షో ఫుల్ ఎమోషనల్ గా సాగనుంది. ఫ్యామిలీ వీక్ నడుస్తుండగా కంటెస్టెంట్స్ ని కలిసేందుకు కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారు. ఆదిరెడ్డి భార్య కవిత, కూతురితో పాటు ఎంట్రీ ఇచ్చారు. ఆదిరెడ్డి కూతురు ఫస్ట్ బర్త్ డే మిస్ కావడంతో కేక్ తెప్పించి హౌస్లో సెలబ్రేట్ చేశారు. కంటెస్టెంట్స్ ఇంట్లోకి వచ్చి మూడు నెలలు కావస్తుంది. హోమ్ సిక్ తో బాధపడుతున్న కంటెస్టెంట్స్ కి ఫ్యామిలీ వీక్ మంచి ఎనర్జీ ఇవ్వనుంది. షో చివరి దశకు చేరుకోగా కొంచెం పుంజుకుంది.