Bigg Boss 6 Telugu Faima: ఈ వారం మొత్తం బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబెర్స్ హౌస్ లోకి రావడం..కాసేపు వాళ్ళు కంటెస్టెంట్స్ తో ముచ్చటించి వెళ్లడం వంటివి ఎమోషనల్ గా ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యింది..ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో రేవంత్ వాళ్ళ భార్య వీడియో కాల్ ద్వారా మాట్లాడడం మరియు ఆ తర్వాత ఆయన అమ్మగారు హౌస్ లోకి అడుగుపెట్టి కాసేపు సందడి చెయ్యడం వంటివి జరిగాయి..అయితే ఆమె హౌస్ లోకి అడుగుపెట్టే ముందు బిగ్ బాస్ ఫైమా తో ఒక ఆట ఆడుతాడు.

ఫైమా కి మొదటి నుండి మట్టిని తినే అలవాటు ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తెలుపుతుంది..అయితే ఇది గమనించిన బిగ్ బాస్ ఫైమా ని పిలిచి ‘ఫైమా మట్టి అంత బాగుందా..తెగ తినేస్తున్నావ్’ అని అడుగుతాడు..అప్పుడు ఫైమా బిగ్ బాస్ ఒక్కసారిగా అలా అడిగేసరికి షాక్ కి గురై ఏమి చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది.
అలాంటి సమయం లో బిగ్ బాస్ మళ్ళీ ఫైమా తో మాట్లాడుతూ ‘ఫైమా మీరు ఈ వారం రేషన్ గా మట్టిని ఎంచుకున్నారు కాబట్టి..మీకు ఈ వారం మేము పంపే రేషన్ ని కట్ చేస్తున్నాము’ అని చెప్తాడు బిగ్ బాస్..అప్పుడు ఫైమా మాట్లాడుతూ ‘సారీ బిగ్ బాస్..ఇక నుండి అలా చెయ్యను..దయచేసి నాకు రేషన్ ని కట్ చెయ్యొద్దు’ అంటూ బ్రతిమిలాడుతుంది.. ఇది జరిగిన కొద్దీ సేపటి తర్వాత బిగ్ బాస్ ఫైమా కోసం ప్రత్యేకంగా నాలుగు గుడ్లని పంపిస్తాడు.

బిగ్ బాస్ వేసిన జోక్ ని నిజం అనుకోని సీరియస్ గా తీసుకున్నందుకు ఫైమా కి నాలుగు గుడ్లని బహుమతిగా ఇస్తున్నట్టు బిగ్ బాస్ గార్డెన్ ఏరియా లో ఉన్న వైట్ బోర్డు మీద ఫైమా స్టైల్ ఇంగ్లీష్ లో రాసి చెప్తాడు..అప్పుడు హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురవుతారు..బిగ్ బాస్ కి ఇలాంటి చిలిపి చేష్టలు చెయ్యడం కూడా వచ్చా అని నవ్వుకున్నారు.