Bigg Boss Season 6 TRP Ratings: బిగ్ బాస్ సీజన్ 6.. ఈసారి అస్సలు ఊపు లేకుండా కొనసాగోంది. ఓవైపు టీమిండియా క్రికెట్ సిరీస్ లు.. ఆసియా కప్, ఆస్ట్రేలియాతో సిరీస్ కు ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతుండగా.. గడిచిన 5 సీజన్లు ఊపేసిన బిగ్ బాస్ .. ఈసారి మాత్రం ఉలుకు పలుకూ లేకుండా సాగుతోంది. హోస్ట్ నాగార్జునలో మునుపటి వాడి తగ్గడం.. గేమ్స్, టాస్క్ రోటీన్ కావడం.. పేరున్న కంటెస్టెంట్లు లేకపోవడం.. హౌస్ లోని ఉన్నవారు కూడా చప్పగా ఆడుతుండడం.. అస్సలు గొడవలు, కొట్లాటలు లేకుండా చిల్ అవ్వడానికే బిగ్ బాస్ కు వచ్చినట్టుగా కంటెస్టెంట్లు మొద్దు నిద్రలో ఉండడమే ఈ దుస్తితికి కారణం.

కారణాలు ఎన్నైనా కానీ ఈసారి బిగ్ బాస్ సీజన్ 6కి అస్సలు రేటింగ్ రావడం లేదట.. కనీసం సీరియల్స్ కు అయినా 10 రేటింగ్ వస్తుంటే.. బిగ్ బాస్ షో రేటింగ్ 4 దాటకపోవడం చూసి నిర్వాహకులు షాక్ అవుతున్న పరిస్థితి నెలకొంది.
2017లో మొదలైన బిగ్ బాస్ తెలుగు ప్రతీ సారి రికార్డులు నెలకొల్పింది. అత్యధికంగా నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ తెలుగు 4 లాంఛింగ్ ఎపిసోడ్ 18.8 టీఆర్పీ రేటింగ్ పొందింది. తాజా సీజన్ మాత్రం దారుణాతి దారుణంగా రేటింగ్ పడిపోయింది. వీక్ డేస్ మాత్రమే కాదు.. నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్లను కూడా జనాలు చూడడం లేదు. ఈ ఎపిసోడ్స్ కు కేవలం 2 నుంచి 2.5 రేటింగ్ మాత్రమే వస్తోంది. నాగార్జున వచ్చే వీకెండ్స్ లో 3-3.5 వరకూ రాబడుతోందట.. ప్రైం టైంలో ఓ పాపులర్ షోకి ఈ రేటింగ్ అంటే చాలా తక్కువని అభిప్రాయపడుతున్నారు.

బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ కూడా 4 టీఆర్పీ దాటలేకపోవడం ఊహించని షాకింగ్ గా మారింది. టీఆర్పీ పెంచాలని నాగార్జున హౌస్ లో స్తబ్దుగా ఉండే షానీ, అభినయశ్రీలను రెండో వారం డబుల్ ఎలిమినేషన్ చేశాడు. కంటెస్టెంట్లను తిడుతూ వార్నింగ్ లు ఇచ్చాడు. అయినా రేటింగ్ మెరుగుపడడం లేదు. ముక్కూ మొహం తెలియని కంటెస్టెంట్స్ హౌస్ లో గత సీజన్ లో ఉన్నా కూడా బాగా రేటింగ్ వచ్చింది. ఈసారి తెలిసిన ముఖాలను పంపినా రేటింగ్ రావడం లేదు.
ఇలానే బిగ్ బాస్ ఆదరణ కొనసాగితే వచ్చేసారికి సీజన్ కష్టమేనని అంటున్నారు. అన్నేసి లక్షలు కంటెస్టెంట్లకు ఇచ్చి.. హోస్ట్ నాగార్జునకు కోట్లు పోసినా రేటింగ్ రాకపోతే ఆదాయం లేకపోతే నడిపించడం కష్టం అని అంతా భావిస్తున్నారు. అందుకే ఈ సీజన్ ఇలాగే కొనసాగితే వచ్చేసారి బిగ్ బాస్ 7 నడిపించడం కష్టమని.. దుకాణం ఈ సీజన్ తోనే బంద్ అవుతుందని అంటున్నారు. ఈ మేరకు స్టార్ మా సైతం నిర్ణయం తీసుకోనుందని సమాచారం.
Also Read: Pawan Kalyan Kushi Re-Release: ఈ ఏడాదిలోనే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి మరో పండుగ
[…] […]
[…] Also Read: Bigg Boss Season 6 TRP Ratings: Falling Bigg Boss Rating.. Worse Than Serials.. Do You Know? […]