Bigg Boss 6 Contestants Remuneration: బుల్లితెరపై సందడి చేయడానికి బిగ్ బాస్ 6 రెడీ అయ్యింది. కింగ్ నాగార్జున దీన్ని నిన్న ఘనంగా లాంచ్ చేశారు. ఏకంగా 21 మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాడు. ఈసారి ఫేడ్ అవుట్ అయిపోయిన నటులను , కమెడియన్స్ ను ఎంచుకున్నారు. ముఖ్యంగా జబర్ధస్త్ నుంచి చలాకీ చంటి, ఫైమాలు అడుగుపెట్టడంతో కామెడీ డోస్ పెరుగుతుందని అంతా భావిస్తున్నారు. సింగర్ రేవంత్, నటుడు బాలాదిత్య సహా కొందరు తెలిసిన ముఖాలు ఉన్నాయి.

ప్రతీ సీజన్ లో ప్రముఖుల కోసం ట్రై చేస్తూ వారు అడిగినంత పారితోషికం ఇచ్చే షో నిర్వాహకులు ఈసారి మాత్రం కాస్త తగ్గించారని.. పెద్దగా పారితోషకం తీసుకోని వారినే ఎంపిక చేసినట్టు సమాచారం. అందుకే పెద్ద నటులు, యంగ్ హీరోలు ఇందులోకి రాలేదని అంటున్నారు. ఇద్దరు ముగ్గురు తప్పితే పెద్దగా మంచి సెలబ్రెటీలు రాలేదన్న టాక్ నడుస్తోంది.
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 21 మందిలో కేవలం ఐదుగురికి మాత్రమే ఈసారి వారానికి ఒక లక్ష ఇచ్చే విధంగా అగ్రిమెంట్ రాసుకున్నారని సమాచారం. అందరిలోకీ జబర్ధస్త్ కమెడియన్ చలాకీ చంటికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలిసింది. చలాకీ చంటికి వారానికి 3 లక్షల వరకూ ఇస్తున్నారని.. సింగర్ రేవంత్ తోపాటు మరో ఐదుగురికి మాత్రమే వారానికి ఒక లక్ష ఇవ్వనున్నట్టు తెలిసింది.

ఇక మిగతా అందరికీ రోజుకు రూ.10వేల చొప్పున మాట్లాడుకున్నట్టు తెలిసింది. సీరియల్ నటులు, ఫేడ్ అవుట్ నటులకు రోజుకు రూ.20వేల నుంచి రూ.30వేలు ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇక సామాన్యుల కేటగిరిలో తీసుకున్న వారికి బల్క్ గా చివరివరకూ ఉంటే 5 లక్షలు ఇచ్చేందుకు మాట్లాడుకున్నట్టు సమాచారం.
ఎవరైతే బిగ్ బాస్ లో సందడి చేసి షో రేటింగ్ కు కారణం అవుతారో వారి పేమెంట్స్ పెంచుతారని.. దీనిపై ముందే కంటెస్టెంట్లకు చెప్పినట్టు సమాచారం. జబర్ధస్త్ కమెడియన్ ఫైమాకు కూడా తక్కువే ఇస్తున్నారని.. ఆమె పర్ పామెన్స్ ఆధారంగా పెంచుతామని చెప్పినట్టు తెలిసింది.